Ramabanam: మీడియా కి కౌంటర్ వేసిన హీరోయిన్

రామబాణం చిత్ర యూనిట్ ప్రమోషన్ లో ఎక్కడా తగ్గడం లేదు. రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమా యూనిట్ కలిసి రామబాణం చిత్రాన్ని వారి ఇంటర్వ్యూ లతో స్పీడ్ గా ప్రమోట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏప్రిల్ 26 న అమీర్ పేట్ లో సారథి స్టూడియోస్ లో రామబాణం చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ మీడియా అడిగే ప్రశ్నలకు తనదైన పద్ధతిలో సమాధానాలు ఇచ్చింది చిత్ర హీరోయిన్ డింపుల్ హయతి.

వివరాల్లోకి వెళితే గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రామబాణం అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. రామబాణం గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ. ఇంతకు ముందు వీరి కాంబో లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సూపర్ హిట్లయ్యాయి. రామబాణం మూవీ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో TG విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు సినిమాపై ఉన్న అంచనాల్ని పెంచేశాయి. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. ఇక రామబాణం చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా అమీర్ పేట్ లో సారథి స్టూడియో లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో మూవీ కి సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ ను ప్రశ్నించడం జరిగింది. దీనిలో భాగంగా ఒక రిపోర్టర్ డింపుల్ హయతి ని ఈ సినిమాలో వల్గర్ గా కనిపించినట్టున్నారు, ఒక ఫ్యామిలీ సినిమా లో ఇలా కనిపిస్తే ఎలా అని అడిగాడు. దానికి డింపుల్ తనదైన శైలిలో జవాబిచ్చింది. డింపుల్ మాట్లాడుతూ  ఈ సినిమా లో తానెక్కడ వల్గర్ గా నటించలేదని, కనీసం ఈ మూవీ యొక్క ట్రైలర్, పాటల్లో కూడా వల్గర్ గా కానీ, ఎక్స్ పోసింగ్ గా కనిపించలేదు. మరీ మీరు ఈ పదం ఎందుకు వాడాల్సివచ్చిందో నాకైతే అర్ధం కాలేదు అని అంది. తాను క్యారెక్టర్ ని బట్టి డైరెక్టర్ చెప్పింది మాత్రమే చేస్తానని అంది. అక్కడే ఉన్న డైరెక్టర్ శ్రీవాస్ ఈ అమ్మాయి ప్రెస్ మీట్ కి వచ్చిన ట్రెడిష్ నల్ పద్ధతి చూస్తేనే మీకు అర్ధమైపోతుంది, తను ఎంత పద్ధతైన అమ్మాయో అని అన్నాడు. ఇక రామబాణం సినిమా మే 5 న విడుదలకు సిద్ధం అవుతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు