Chandu mondeti : కీర్తి సురేష్ ప్రేమలో నాగచైతన్య..!

సమంతతో విడాకుల అనంతరం హీరో నాగచైతన్య.. శోభిత దూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ పలు రూమర్స్ పుట్టుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రూమర్స్ ని శోభిత కొట్టిపడేసింది. తమ మధ్య అటువంటివి ఏమీ లేవని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కీర్తి సురేష్ తో నాగచైతన్య ప్రేమలో ఉన్నాడట ఏంటి షాక్ కి గురయ్యారా..? అయితే ఇది నిజ జీవితంలో కాదండి.. వెండితెరపై మాత్రమే. నిజంగానే వెండితెరపై కీర్తి సురేష్ – నాగ చైతన్య ప్రేమలో పడబోతున్నారు.

దర్శకుడు చందు మొండేటి – నాగచైతన్య మళ్లీ కలిసి పని చేయనున్నారు. గతంలో వీరిద్దరూ మలయాళ బ్లాక్ బస్టర్.. తెలుగు వెర్షన్ ప్రేమమ్ లో కలిసి పనిచేశారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. ఇక ఇటీవల చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్యకు హిట్ ఇచ్చేందుకు చందు మొండేటి రెడీ అయ్యారు.

ఈ సినిమాను గీతా ఆర్ట్స్ తెరకెక్కిస్తోంది. సూరత్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథలో చైతు బోట్ డ్రైవర్ గా పని చేస్తాడట. ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మహానటి సినిమాలో చైతన్యతో – కీర్తి సురేష్ రెండు, మూడు సన్నివేశాలలో కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాలో చైతుకి జంటగా కీర్తి నటిస్తోంది. ప్రస్తుతం భోళాశంకర్ సినిమా షూటింగ్ లో కీర్తి బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాతోనైనా చైతు సక్సెస్ అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు