Chandrabose : రచనలో ముందు చూపు… మరోసారి ప్రూవ్ అయింది

తెలుగు సినిమా చరిత్రలో చాలా మంది సాహిత్య రచయితలు ఉన్నారు. వారు రాసినటువంటి పాటలు వింటుంటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఆ పాటలు కొన్నిసార్లు ఓదార్పు అవుతాయి. ఓటమిలో ఉన్నప్పుడు గెలుపు అవుతాయి. అదే పాటలు కొన్ని జీవితాలకు మలుపు కూడా అవుతాయి. తెలుగు సినిమా పరిశ్రమలో సాహిత్య రచయితలు ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు.

సముద్రాల రాఘవాచార్యులు, శ్రీరంగం శ్రీనివాసరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆత్రేయ, దాశరధి కృష్ణమాచార్య, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి, వేటూరి సుందర రామ మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, భాస్కరభట్ల రవికుమార్, రామ జోగయ్య శాస్త్రి వంటి అందరు సాహిత్య రచయితలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దక్కిన వరమని చెప్పొచ్చు. అందులో ఒక్కొక్కరిది ఒక్కో శైలి.

ఇప్పటితరంలో ఉన్న సాహిత్య రచయితలలో చంద్రబోస్‌ది ఒక విభిన్నమైన శైలి. అమ్మ పాట రాసిన, అమ్మాయి పాట రాసిన, సరసం రాసిన, విరహం రాసిన , ఆయన రాసిన వాఖ్యలను చదివితే ఊహల్లో విహరిస్తాం, ఆ భావాల్లో మునిగితేలుతాం. శోభనం సన్నివేశం పాటలో శ్రీరామ అని వినిపించేలా, కమర్షియల్ సినిమా పాటలో సందేశం కనిపించేలా రాయడం ఆయన కలానికి చెల్లింది.

- Advertisement -

చంద్రబోస్ దాదాపుగా అన్నీ రకమైన పాటలు రాసారు. అలానే కొన్ని పరిణామాలు జరుగుతున్నప్పుడు… ముందుచూపుతో కొన్ని పాటలను రాసారా… అనే ఆలోచన కలుగుతుంది. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. కానీ దాదాపుగా పదేళ్ల క్రితమే “రచ్చ” అనే సినిమాలో “He is Gonna Be a Global Star” అనే లైన్ రాసారు చంద్రబోస్.

Chandrabose was a visionary literary writer

 

ఇక అసలు విషయానికి వస్తే. ఒకప్పుడు మంచి రచయితగా పేరు సాధించిన చిన్ని కృష్ణ ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అవి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి “పద్మ విభూషణ్” అవార్డును అందుకున్న సందర్భంగా రచయిత చిన్ని కృష్ణ మెగాస్టార్ ని కలిసారు.

ఈ తరుణంలో “అన్నయ్యకు పద్మవిభూషణ్ వచ్చిందని తెలిసి చాలా సంతోషించా. ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపాను. ఈ భూమ్మీద పుట్టిన అందరూ అనను కానీ కొందరు తప్పులు చేస్తారు. తప్పులు మాట్లాడతారు అన్నది నగ్నసత్యం. నా మీద నమ్మకంతో నన్ను పిలిచి ఇంద్ర సినిమా ఇచ్చిన చిరంజీవిగారిని నాకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న సమయంలో పేర్లు చెప్పను. కానీ కొందరి “ప్రభావం, ఒత్తిడి వల్ల అన్నయ్యపై పలు వ్యాఖ్యలు చేశాను. నోటికొచ్చినట్లు మాట్లాడాను. ఇష్యూ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా చిరంజీవిగారికి ఎదుటపడలేదు. ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిందని విష్ చేయడానికి ఇంటికివెళ్తే ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న విధానం, నా భార్యబిడ్డలు, వారి బాగోగులు గురించి ఆడిగిన తీరు చూసి నాలో నేనే బాధ పడ్డాను. ‘ఇలాంటి వ్యక్తినా నా నోటితో తప్పుగా మాట్లాడాను’ అని నా తప్పు తెల్సుకుని క్షమించమని అన్నయ్యను అడిగాను. ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అన్నయ్య మనసారా మాట్లాడటమే కాకుండా ‘కలిసి పని చేద్దాం.. మంచి కథ చూడు’ అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే ఆయనకు సోదరుడిగా పుట్టాలని కోరుకుంటున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.

Chandrabose was a visionary literary writer

ఈ తాజా పరిణామంలో చంద్రబోస్ ఠాగూర్ సినిమాలో రాసిన కొడితే కొట్టలిరా పాటలో ఒక లిరిక్ గుర్తొస్తుంది. “శరణంటూ వచ్చేసే శత్రువునైనా ప్రేమించరా” అనే లైన్ ఇప్పుడు కరక్ట్ గా చిరంజీవి వ్యక్తిత్వానికి సరిపోతుంది. ఒక స్టార్ హీరోను ఎంత లోతుగా పరిశీలన చేస్తే అంత కరక్ట్ గా వ్యక్తిత్వానికి సరిపడే సాహిత్యాన్ని అందించారు అనేది విశేషం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు