RAPO20 : బాలయ్య ఫార్ములా

బోయపాటి శ్రీను, టాలీవుడ్ లో మాస్ యాక్షన్ డైరెక్టర్. బోయపాటి చేసిన పది సినిమాల్లో, పది సినిమాలు యాక్షన్ నేపథ్యంలోనివే. దానిలో ఐదు సినిమాలు పెద్ద విజయాన్ని అందుకున్నాయి. అందులో మూడు సినిమాలు నందమూరి నటసింహం బాలయ్య తో చేసినవే.
దీనిని బట్టి బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్ ప్రేక్షకులు ఎంత ఇష్టపడతారో తెలిసిపోతుంది.

బాలయ్య-బోయపాటి కాంబోలో ఇప్పటి వరకు సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్లు కొన్ని ఉన్నాయి.
బాలయ్యకు మాస్ ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి.
అలాగే యాక్షన్ సీన్స్ కు ప్రాధాన్యత ఉంటుంది.
కాస్త పొలిటికల్ టచ్ ఉంటుంది.
హీరో పెద్ద కుటుంబానికి చెందిన వాడై ఉంటాడు.
అన్నింటికంటే ముఖ్యంగా ప్రతి సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తాడు.
ఆ రెండు పాత్రలు కూడా ఒకే కుటుంబానికి చెందినవిగా ఉంటాయి.

బాలయ్యతో చేసిన ప్రతి మూవీలో బోయపాటి ఈ ఫార్ములానే పాటించాడు. మంచి హిట్స్ కొట్టాడు. అయితే, ఈ ఫార్ములాను బోయపాటి మరోసారి ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే, ఈ సారి బాలయ్య తో కాకుండా, యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ఈ ఫార్ములాను వాడబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -

రామ్ పోతినేని – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. RAPO20 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు గత కొద్ది రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతుంది. RAPO20లో రామ్ రెండు పాత్రలు చేయడం నిజమేనట. ఈ రెండు పాత్రలు కూడా ఒకే కుటుంబానికి చెందినవిగా ఉంటాయని టాక్.
అయితే అవి తండ్రి కొడుకుల పాత్రలా లేదా అన్నదమ్ముల పాత్రలా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు