Nandamuri Balakrishna: ఈ సింహం గర్జన అంతా ఇక్కడే… టాలీవుడ్ దాటితే జీరోనే..!

నందమూరి బాలకృష్ణ గర్జన అంతా టాలీవుడ్ లో నేనా? టాలీవుడ్ దాటితే ఈ టాప్ హీరో జీరోనేనా? తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న వారిలో చాలామందికి ఇప్పటికే ఈ అనుమానాలు వచ్చి ఉంటాయి. తాజాగా జరిగిన రామ మందిరం మహోత్సవ కార్యక్రమానికి ఈ టాలీవుడ్ సింహానికి ఆహ్వానం అందకపోవడమే దీనికి కారణం.

2024 జనవరి 22… దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోయే రోజు. కోట్లాదిమంది ప్రజలు కలలు కంటున్న అయోధ్య రామ మందిరం ప్రారంభ మహోత్సవం జరిగిన రోజు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన శుభదినం. ఈ మహోత్సవానికి దేశవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి చిరంజీవి ఫ్యామిలీ మొత్తానికి ఈ వేడుకకు ఆహ్వానం అందడం విశేషం.

ఇప్పటికే అయోధ్యలో చిరు ఫ్యామిలీ సందడి చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీకి ఆద్యుడైన నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న బాలయ్యకు ఈ వేడుకకు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్ సింహం అని చెప్పుకునే బాలయ్య గర్జన కేవలం తెలుగు సిల్వర్ స్క్రీన్ కే పరిమితమా? టాలీవుడ్ దాటితే ఈ హీరో జీరో నేనా? అనిపిస్తోంది.

- Advertisement -

ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలలో చాలామంది బాలకృష్ణను ఇగ్నోర్ చేస్తూ మాట్లాడడం చూసాము. ముఖ్యంగా ఎదుటి వ్యక్తికి గౌరవాన్ని ఇస్తూ తీసుకునే చిరంజీవిని టాలీవుడ్ లో ఎక్కువ మంది ఇష్టపడతారు. అలాగే ఆయన ఇంట ఏ ఫంక్షన్ జరిగినా కానీ బాలయ్యకు మాత్రం ఆహ్వానం అందదు. ఇక చిరు తన తోటి హీరో హీరోయిన్లతో కలిసి ఏడాదికోసారి సెలెబ్రేట్ చేసుకునే ఈవెంట్ కు ఒక్కసారి కూడా బాలయ్యకు ఆహ్వానం అందలేదు.

అలాగే ఇండస్ట్రీలో ఎలాంటి సమస్య వచ్చినా బాలయ్య నుంచి ఎలాంటి స్పందన ఉండదు. సినిమా వాళ్లు కూడా బాలయ్య దగ్గరికి వెళ్లకుండా చిరంజీవి దగ్గరికి వెళ్లి తమ సమస్యను ఆయన ముందుంచి, చిరును ఇండస్ట్రీకి పెద్దను చేసేస్తున్నారు. కేవలం నందమూరి వారసుడిని అని చెప్పుకోవడానికి, అభిమానుల చెంప ఛెళ్లుమనిపించడానికి, వెండి తెరపై తన బ్యాక్ గ్రౌండ్ గురించి గొప్పలు చెప్పుకోవడంలో మాత్రమే ఈ సింహం గౌరవం కనిపిస్తుంది.

ఒక్కసారి ఆ సిల్వర్ స్క్రీన్, టాలీవుడ్ దాటితే ఈ హీరో గురించి ఒక్కరు కూడా పట్టించుకోరు. తాజాగా అయోధ్య ప్రారంభోత్సవానికి కనీసం మర్యాదకైనా బాలయ్యకు ఆహ్వానం అందకపోవడమే దీనికి నిదర్శనం. ఇప్పటిదాకా టాలీవుడ్ మాత్రమే ఇగ్నోర్ చేసింది, కానీ ఇప్పుడు అయోధ్య నుంచి ఆహ్వానం అందకపోవడంతో నేషనల్ వైడ్ గా బాలయ్యకు గుర్తింపు లేదని మరోసారి తెలిసిపోయింది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు