Guntur Kaaram : కుర్చీ సాంగ్ లో మరో హీరోయిన్?

Guntur Kaaram :”గుంటూరు కారం” నుంచి తాజాగా రిలీజ్ అయిన మాస్ సాంగ్ “కుర్చీ మడత పెట్టి” ఎంతటి అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మోస్ సాంగ్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సాంగ్ లో కేవలం శ్రీ లీల మహేష్ బాబు మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా ఉందని తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అనే విషయంలోకి వెళ్తే…

“కుర్చీ మడత పెట్టి” సాంగ్ ప్రోమో తోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఎంతో క్లాస్ గా కనిపించే మహేష్ బాబు తన సినిమాల్లో ఇలాంటి పదం వాడడం ఏంటి? తెలుగు భాష, సాహిత్యానికి ఎంతగానో గౌరవం ఇచ్చే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ పాటలో ఇలాంటి లిరిక్స్ ఉండడానికి ఎలా ఒప్పుకున్నాడు? అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాధ్యతాయుతంగా ఉండాల్సిన మహేష్ బాబు లాంటి ఒక సూపర్ స్టార్ ఇలాంటి పాటలో స్టెప్పులు వేయడం ఏంటో అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి.

కానీ మరోవైపు మహేష్ అభిమానుల నుంచి ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మహేష్ ఈ పాటలో మాస్ స్టెప్పులు వేయడం, ఆయన ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విమర్శలను పక్కన పెడితే ఈ సినిమాకు రోజుకో కాంట్రవర్సీతో బాగానే ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు “కుర్చీ మడత పెట్టి” ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇక ఈ లిరికల్ వీడియోలో శ్రీలీల, మహేష్ బాబు మాత్రమే కనిపించారు. కాబట్టి సాంగ్ అంతా వీళ్లిద్దరి మధ్య ఉంటుందని అనుకున్నారు.

- Advertisement -

కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ “కుర్చీ మడత పెట్టి” సాంగ్ లో మరో హీరోయిన్ కూడా కనిపించబోతోంది అనే వార్త ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. “రాజమండ్రి రాజమందిరి… మా యమ్మ పేరు తలవనోరు లేరు మేస్త్రి.. కళాకారుల ఫ్యామిలీ మరి… నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాతిరి” ఈ లిరిక్స్ శ్రీలీల మీద కాదట. ఫిల్మీ ఫైకి ఎక్స్ క్లూజివ్ గా అందుతున్న సమాచారం ప్రకారం మెయిన్ సాంగ్ అంతా శ్రీలీల మీదనే ఉంటుంది.

కానీ టేక్ ఆఫ్ మాత్రం మరో హీరోయిన్ పూర్ణ మీద ఉంటుందని తెలుస్తోంది. “గుంటూరు కారం” టీం సీక్రెట్ గా ఉంచిన ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది. బహుశా చిత్ర బృందం థియేటర్లలోనే ఈ సర్ప్రైజ్ చేసి ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేయాలని అనుకున్నారేమో. కానీ అంతకంటే ముందే ఈ విషయం బయటకు వచ్చి వాళ్లను నిరాశకు గురి చేసింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు