Alia Bhatt : శాంతికి చిహ్నంగా..

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లిస్ట్ లో అలియా భట్ ఒకరు. చాలా రోజుల నుంచి స్టార్ ఇమేజ్ ఉన్న అలియా భట్.. ఇటీవల గంగూబాయి కతియావాడి సినిమాతో మరింత పాపులర్ అయింది. ఈమె తొటి నటుడు రణ్ బిర్ కపూర్ ను ఈ ఏడాది ప్రారంభంలో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా అలియా వరుసగా సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత అలియా నటించిన డార్లింగ్ సినిమా కొంత వరకు నిరాశ పరిచినా, రణబీర్ కపూర్ తో కలిసి చేసిన బ్రహ్మాస్త్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది.

దీని తర్వాత అలియా పెగ్నెంట్ అని ప్రకటించింది. సినిమాలకు కూడా దూరంగా ఉంది. ఈమెకు ఇటీవల ఒక పాప కూడా పుట్టిన విషయం తెలిసిందే. తాజాగా తన పాప పేరును అభిమానులతో పంచుకుంది అలియా. తన పాపకు రాహా అనే పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ పేరును తన రణబీర్ కపూర్ ఎంపిక చేసినట్టు చెప్పుకొచ్చింది. అలాగే రాహా అంటే మినింగ్ ను కూడా తెలిపింది.

రాహా అంటే స్వచ్ఛమైన రూపంలో దైవిక మార్గం అని అర్థం అని చెప్పింది. అలాగే “సంస్కృతంలో రాహా అంటే ఒక వంశం. బంగ్లాలో రాహా అంటే విశ్రాంతి, సౌకర్యం, ఉపశమనం. అరబిక్ లో మినింగ్.. శాంతి, స్వేచ్ఛ, ఆనందం” అంటూ వివరించింది. మొత్తంగా తన కూతురు పేరును శాంతికి చిహ్నంగా అలియా-రణబీర్ పెట్టినట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు