Agent : యాక్షన్ మూడ్

అగ్ర హీరోల కొడుకులు ఇండస్ట్రీకి చాలా మంది వచ్చారు. అందులో సరైనా హిట్ అందుకుని, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేలా ఉంది అది కొద్ది మందే అని చెప్పొచ్చు. అక్కినేని నాగర్జున తన ఇద్దరి కొడుకులను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. నాగ చైతన్య కింద మీద పడి ఇప్పుడిప్పుడే ఒక మంచి హీరోగా పేరు సంపాదించుకుంటున్నాడు.

ఇక అక్కినేని అఖిల్ పోరాటం ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశాడు. అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మినహా, అన్ని సినిమాలు ఫ్లాప్ అని చెప్పొచ్చు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా పెద్ద హిట్ ఏం కాదు. దీని తర్వాత ఈ అక్కినేని హీరో చూపులు మొత్తం సురేందర్ రెడ్డి సినిమాపైనే ఉన్నాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్పై థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. అలాగే పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుంది. మలయాళం నటుడు ముమ్ముట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

- Advertisement -

ఇదిలా ఉండగా, ఈ సినిమా నుండి ఇప్పటి వరకు పోస్టర్స్ మాత్రమే వచ్చాయి. తాజా గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు సాయంత్రం 5:05 గంటలకు ఈ సినిమా టీజర్ రానుంది. దీని కోసం ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అఖిల్ మిషన్ గన్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మూడ్ లో కనిపిస్తున్నాడు.

ఈ ఒక్క పోస్టర్ తోనే సినిమా అంచనాలు, రాబోయే టీజర్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు