Radhe Shyam: 18 ఏళ్లు పనిచేసిన కథకి నేటికి రెండేళ్లు

పాన్ ఇండియా సార్ ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు ప్రభాస్. అయితే బాహుబలి సినిమా తర్వాత అంతటి స్థాయి హిట్ సినిమాను ఇప్పటివరకు ప్రభాస్ అందుకోలేదు. కానీ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాతో ఆ స్థాయి హిట్టు కొడతాడని చాలామంది నమ్ముతున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగిపోయిన విషయం మనకు తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎదురు చూడటం మొదలుపెట్టారు.

బాహుబలి సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సాహో. అయితే సాహో సినిమా టెక్నికల్ గా చాలా బ్రిలియంట్ గా అనిపిస్తుంది.కానీ తెలుగు ప్రేక్షకులకి ఆ సినిమా అంతగా ఎక్కలేదు. కానీ నార్త్ లో మాత్రం ఈ సినిమా ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. చాలామంది నార్త్ లో సాహో సినిమాకి బ్రహ్మరథం పట్టారు. కేవలం నార్త్ లో హిట్ అవటం వల్లనే ఆ సినిమా కొంత మేరకు సేఫ్ జోన్ లోకి వచ్చిందని కూడా చెప్పొచ్చు.

ఇకపోతే ప్రభాస్ సాహో తర్వాత చేసిన సినిమా రాధే శ్యామ్. ఈ సినిమాను రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించాడు. ఈ సినిమాను రొమాంటిక్ డ్రామాగా తీశాడు రాధాకృష్ణ. అయితే ఈ సినిమా హిందీ తెలుగు, లాంగ్వేజ్ లో ఒకేసారి చిత్రీకరించబడింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించింది. 1970లో ఇటలీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం విక్రమాదిత్య అనే ఒక జ్యోతిష్యుడు చుట్టూ తిరుగుతుంది.

- Advertisement -

ఈ టైటిల్ ని చూసి చాలామంది ఇది ఒక ఎపిక్ లవ్ స్టోరీ అవుతుందని అనుకున్నారు. అలానే ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అలానే మనోజ్ పరమహంస ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చేశారు. ఈ సినిమాను ఇటలీ, లండన్ మరియు జార్జియాలో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఒక అందమైన పెయింటింగ్ లా ఉంటుందని చెప్పొచ్చు.

బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావటం అలానే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఈ సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ పెంచడం. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళిన ఆడియన్స్ కి ఈ సినిమా యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవడం వలన ఇది డిజాస్టర్ గానే మిగిలింది. అయితే కొంతకాలం తర్వాత కొన్ని సినిమాల వాల్యూ తెలుస్తుంది అన్నట్లు. ఈ సినిమాను కొన్ని రోజులు తర్వాత చూసిన ఆడియన్స్ కి ఈ సినిమా బానే ఉంది కదా అని ఒక అభిప్రాయం కలిగింది.

అసలు ఈ కథని మొదట చంద్రశేఖర్ ఏలేటి అనుకున్నారు. అయితే ఈ కథను డెవలప్ చేయమని చెప్పి రాధాకృష్ణకి అప్పజెప్పాడు చంద్రశేఖర్ ఏలేటి. అయితే వీరిద్దరూ కలిసి ఈ సినిమాను ఫినిష్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత ఆ థాట్ ని రాధాకృష్ణ కుమార్ తీసుకొని ఒక 18 ఇయర్స్ వరకు కష్టపడి దాన్ని డెవలప్ చేసి, బాహుబలి షూటింగ్ టైంలో ప్రభాస్ కి ఈ స్క్రిప్ట్ ని వినిపించాడు. వెంటనే ఈ స్క్రిప్ట్ నచ్చి ప్రభాస్ ఒకే చేశారు.

అయితే మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్ పాలైనా కూడా దీనిలో రాధాకృష్ణ వర్క్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అలానే ప్రభాస్ ని చూపించిన విధానం. చాలామందికి ఈ సినిమా ఇప్పటికీ ఒక ఫేవరెట్ అని చెప్పొచ్చు. నేటికీ ఈ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు