NAYANATHARA: లేడీ సూపర్ స్టార్ బాలీవుడ్ లోనూ చక్రం తిప్పుతుందా?

Nayanathara jawan:

సౌత్ లో సీనియర్ హీరోలతో నటిస్తూ పెళ్లి తర్వాత కూడా సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ నయనతార. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ ఇప్ప్పుడు అరడజను కి పైగా సినిమాలతో బిజీ గా ఉంది. తమిళ్ లో నాలుగు సినిమాలు చేస్తుండగా, ఇతర భాషల్లోనూ రెండు సినిమాలు చేస్తుంది. అయితే ఇప్పటివరకు సౌత్ లోనే సినిమాలు చేసిన ఈ భామ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దాదాపు ఇరవై ఏళ్లకు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.

అదికూడా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమాతో కావడం విశేషం. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ సినిమాలో నయనతార ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుంది. అయితే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడం వల్ల ఆ డైరెక్టర్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కూడా జవాన్ లో నటించడానికి ఒక కారణం అని చెప్పొచ్చు.

అయితే ఇప్పటివరకు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా, ముఖ్యంగా తమిళ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పిన నయనతార ఫస్ట్ టైం హిందీలో ఎంట్రీ ఇస్తుంది. అయితే లేట్ ఎంట్రీ లో నయనతార అక్కడ సక్సెస్ అవుతుందా అన్నదే ప్రశ్న. జవాన్ ట్రైలర్ ని చూస్తే హిట్ కొట్టేలాగే ఉంది. అయితే నయనతారకి అక్కడ ఆఫర్ లు వస్తాయా లేదా అనేది చూడాలి.

- Advertisement -

అయితే ఈ భామకి ఆఫర్లు వస్తే దాదాపు సీనియర్ హీరోల సినిమాల్లోనే వస్తాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే 40కి చేరువలో ఉన్న నయనతార హీరోయిన్ గా మరో ఐదారేళ్ళు మాత్రమే చేయగలదు. ఈ గ్యాప్ లో నయనతార బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేస్తుందో ఏమో మరి. ఏది ఏమైనా నయన్ ఏ ఇండస్ట్రీ కి వెళ్లినా తమిళ్ లో తనకున్న ఫాలోయింగ్ ముందు ఏది నిలబడదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు