Balayya : కుర్ర హీరోలే ఎందుకు ?

బాలయ్య సినిమాలకే కాదు.. ఆయన చేసే షోలకు కూడా క్రేజ్ ఎక్కవే. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రిన్ పై గర్జించిన ఈ నటసింహం, గతేడాది బుల్లితెర పై కూడా గర్జించాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో అన్ స్టాపబుల్ అనే షో చూసి హోస్ట్ రంగానికే ఒక కళ తెచ్చాడు. అన్ స్టాపబుల్ మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయింది. ప్రస్తుతం రెండో సీజన్ సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రెండో సీజన్ కు సంబంధించి టీజర్, లుక్ విడుదల చేశారు.

అలాగే ఈ రెండో సీజన్ కు సంబంధించి మొదటి ఎపిసోడ్ చిత్రీకరణ కూడా కూడా పూర్తి అయింది. ఫస్ట్ ఎపిసోడ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు తో పాటు లోకేష్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే దీనికి ముందు అన్ స్టాపబుల్ రెండో సీజన్ ను మెగా హీరోలతో స్టార్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవితో గానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గానీ ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి.

కానీ అనూహ్యంగా బాలయ్య బావ చంద్రబాబు తెరపైకి వచ్చాడు. దీని వెనక రాజకీయ కోణం ఉందని పలువరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, అన్ స్టాపబుల్ రెండో సీజన్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో తర్వాత అయినా, మెగా హీరోలు వస్తారా అంటే.. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం.. కష్టమే అని సమాధానం వస్తుంది. రెండో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఈ రోజు షూటింగ్ కూడా జరుగుతుందని టాక్.

- Advertisement -

అయితే మిడ్ రేంజ్ హీరోలపైనే బాలయ్య ఎందుకు ఆసక్తి చూపుతున్నాడు అనే డౌట్ ప్రస్తుతం టాలీవుడ్ లో వస్తుంది. నిజానికి విశ్వక్, సిద్ధు ఈ తరంలో మంచి నటులే. కానీ, బాలయ్య షోకు రావడానికి ఎంత కంటే నేమ్, ఫేమ్ ఉన్న హీరోలు, దర్శకులు చాలా మంది ఉన్నారు. కానీ కుర్ర హీరోలనే ఆహ్వానించడంలో ఉన్న మతలాబు ఎంటో మరి బాలయ్యకే తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు