PowerStar: టీజర్ ఇంకెప్పుడు ‘బ్రో’..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో సముద్రఖని డైరెక్షన్లో మలయాళ సినిమా వినోదాయ సీతాం కి రీమేక్ గా రూపొందుతున్న సినిమా ‘బ్రో’. చాలా వరకు షూటింగ్ పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీమేక్ అయినప్పటికీ పవన్, తేజ్ కలిసి నటించిన సినిమా కావటంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్, సినిమాపై అంచనాలు పెంచేసింది. జులై 29న రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఇంకా రిలీజ్ కాకపోవటంతో అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో వస్తున్న ఓజి సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైనా జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతూ తరచూ అఫీషియల్ గా, నాన్ అఫీషియల్ గా ఏదో ఒక అప్డేట్ వినిపిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. అలాంటిది రిలీజ్ దగ్గర పడుతున్న బ్రో సినిమా గురించి మాత్రం టైటిల్ గ్లింప్స్ మినహా ఎలాంటి అప్డేట్ లేకపోవటం అభిమానులను అసహనానికి గురి చేస్తోంది.

పవన్ కళ్యాణ్ సీన్లకు కి సంబంధించిన  షూటింగ్ పూర్తయినా ఇంకా తేజ్ సీన్లు పూర్తి కాకపోవటమే టీజర్ రిలీజ్ లో జాప్యానికి కారణం అని తెలుస్తోంది. టైటిల్ గ్లింప్స్ లో పవన్ స్టైలిష్ లుక్ తో కనిపించి అలరించటంతో అభిమానులు టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమా తేజ్ మరొక బ్లాక్ బస్టర్ అందిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు