Vijay Devarakonda: సీనియర్ డైరెక్టర్స్ కు నో ఛాన్స్… రౌడీ హీరో నిర్ణయం ఇదే

రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుసగా డిజాస్టర్లు అందుకుంటున్నప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా బడా డైరెక్టర్స్ సైతం ఆయనతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించకుండా యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఇదంతా “లైగర్” ఎఫెక్ట్ అని అంటున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న సినిమాలు చూస్తే ఇదే నిజం అనిపిస్తుంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”. “గీత గోవిందం” సినిమాతో విజయ్ దేవరకొండకు మొదటి 100 కోట్ల సినిమాను ఇచ్చిన డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రెండవ చిత్రం కావడంతో “ఫ్యామిలీ స్టార్” మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. “ఫ్యామిలీ స్టార్” ఏప్రిల్ 5న రిలీజ్ కానుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ చేయబోయే నెక్స్ట్ సినిమాల గురించి చర్చ మొదలైంది. ఇప్పటికే సుకుమార్, కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్స్ ఈ రౌడీ హీరోతో సినిమాలు చేస్తామని ప్రకటించారు. కానీ విజయ్ మాత్రం వాళ్లను పక్కన పెట్టి యంగ్ డైరెక్టర్స్ కే ప్రాధాన్యతనిస్తున్నారు.

“ఫ్యామిలీ స్టార్” తర్వాత గౌతం తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించనున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన పలువురు యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో విజయ్ సినిమాలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ముగ్గురు డైరెక్టర్స్ కథలను విజయ్ ఫైనల్ చేసినట్టు సమాచారం. అందులో రాజా వారు రాణి గారు ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా రూపొందే ఛాన్స్ ఉంది. ఆ మూవీని కూడా దిల్ రాజే నిర్మించనున్నారని అంటున్నారు.

- Advertisement -

రీసెంట్ గా “కెప్టెన్ మిల్లర్” సినిమాతో వచ్చిన డైరెక్టర్ అరుణ్ ముత్తేశ్వరన్, కన్నడ డైరెక్టర్ నార్తన్ కథలను విజయ్ లైన్లో పెట్టినట్టు సమాచారం. మొత్తానికి “లైగర్” మూవీతో పాన్ ఇండియా వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి దెబ్బ తిన్న విజయ్ కళ్ళు ఇప్పటికి తెరుచుకున్నాయి అన్నమాట. ఫలితంగా ఇలా యంగ్ డైరెక్టర్స్ సినిమాలతో మార్కెట్ రేంజ్ ను మరింతగా పెంచుకొని, ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ తో మూవీస్ చేయాలని విజయ్ ప్లాన్ చేస్తున్నాడు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు