Varun Tej : పొద్దున్నే ట్రైలర్ లాంచ్.. సాయంత్రానికి ఇలా?

రిలీజ్ డేట్ టైం దగ్గరపడుతున్న కొద్దీ ఆపరేషన్ వాలెంటైన్ టైం ప్రమోషన్స్ లో జోరు పెంచాల్సింది. కానీ రిలీజ్ కి పది రోజులే సమయం ఉండడంతో మూవీ ప్రమోషన్స్ ఎలా చేస్తారా అని నెటిజన్లు అభిప్రాయ పడ్డా, వాళ్ళ అనుమానాలన్నిటికి తెరదించుతూ చిత్ర యూనిట్ దూసుకుపోతున్నారు. దాదాపు వారం రోజుల పాటు వరుణ్ తేజ్ హీరోయిన్ మానుషీ చిల్లర్ తో కలిసి బాలీవుడ్ ట్రిప్ వేసాడు. అక్కడ దాదాపు పాతిక ఇంటర్వ్యూ లు ఇవ్వగా, ఐదారు షో లలో కూడా పాల్గొన్నాడు. ఇక వాలెంటైన్స్ డే రోజు మూవీ టీం తో కలిసి పుల్వామా అటాక్ జరిగిన ప్లేస్ కి కూడా వెళ్లడం జరిగింది.

అయితే హిందీ మూవీ ప్రమోషన్స్ వరకూ బాగానే ఉన్నా, తెలుగు వెర్షన్ కి వచ్చే సరికి లైట్ తీసుకున్నారేమోనని కొందరు భావించినా, వెంటనే తెలుగులోనూ ప్రమోషన్ ఊపుని పెంచేశారు మేకర్స్. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ ని అఫిషియల్ గా రిలీజ్ చేసి అందర్నీ ఒక్క ట్రైలర్ తో అలర్ట్ చేసారు. ఈ లాంచ్ ఈవెంట్ లో చిత్ర నటీనటులతో ప్రెస్ మీట్ కూడా జరిగింది. ఇక ఈ ఈవెంట్లో మెగా ఫ్యాన్స్ చరణ్, పవన్ సినిమాల అప్డేట్ లు కూడా వైరల్ అయ్యాయని తెలిసిందే. అయితే ఆ సాయంకాలానికే వరుణ్ తేజ్ మరో ఈవెంట్ కి గెస్ట్ గా హాజరయ్యాడు.

కమెడియన్ అభినవ్ గోమటం హీరోగా నటించిన మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా! మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వరుణ్ తేజ్ గెస్ట్ గా హాజరయ్యాడు. ముందుగా తన మూవీ ప్రమోషన్స్ చేయకుండా, వేరే సినిమాల ఈవెంట్లో పాల్గొంటాడేంటి వరుణ్ అని అనుకున్నా, ఆ తర్వాతే అర్ధమైంది ఇది కూడా ఒక రకమైన ప్రమోషన్ అని. అవును.. మామూలుగా ఆపరేషన్ వాలెంటైన్ గురించే ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రమోట్ చేస్తే, అన్ని చోట్ల అవే ప్రశ్నలు, అవే సమాధానాలు. అదే ఇలా వేరే హీరోల ఈవెంట్స్ కి వెళితే అక్కడ ఆ సినిమా ఈవెంట్ కోసం వచ్చిన ఆడియన్స్ కి కూడా తమ సినిమా గురించి ఓ హింట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లాజిక్ తెలిసిన నెటిజన్లు వరుణ్ డబుల్ ప్రమోషన్ అదిరిందని కితాబిస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు