Ravi Teja: స్పీడ్ పెంచిన టైగర్ నాగేశ్వరరావు 

మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. పాన్ ఇండియా వైడ్ విడుదల కానున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతోంది. రీసెంట్ గా రావణాసుర సినిమాతో డిజాస్టర్ చవిచూసిన రవితేజకి ఈ సినిమా హిట్ అవ్వడం కీలకంగా మారింది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చయ్యిందని అంటున్నారు. 30కోట్ల ఎస్టిమేటెడ్ బడ్జెట్ తో మొదలైన ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే 50కోట్ల బడ్జెట్ దాటిపోయిందని అంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఇందుకోసం కోట్ల రూపాయల విలువైన సెట్స్ వేశారని సమాచారం అందుతోంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానున్న ఈ సినిమా రవితేజ నటించిన తొలి ఫుల్ లెంత్ బయోపిక్ గా నిలుస్తుంది. రావణాసుర సినిమా ద్వారా డిజాస్టర్ అందుకున్నప్పటికీ ఇటీవల విడుదలైన గ్లిమ్ప్స్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేస్తోంది.

మరి, రవితేజ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమా కావటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.అయితే, నిర్మాత అభిషేక్ అగర్వాల్ గతంలో కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు కాబట్టి  తనకున్న అవగాహనతో ఈ సినిమాను కూడా పాన్ ఇండియా వైడ్ ఎఫెక్టివ్ గా ప్రమోట్ చేసి రవితేజ కి పాన్ మొదటి పాన్ ఇండియా హిట్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు