Akhil: తప్పు ఒప్పుకున్న నిర్మాత..!

అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో భారీ బడ్జెట్లో రూపొంది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అఖిల్ ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ ఈ సినిమా ద్వారా దక్కుతుందని అక్కినేని ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నీ తొలి ఆటతోనే అడియాశలయ్యాయి. రెండేళ్లకు పైగా సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసి అఖిల్ పడ్డ కష్టం అంతా డిజాస్టర్ రూపంలో వృధా అయ్యింది. ఏజెంట్ సినిమా డిజాస్టర్ అవ్వటానికి సురేందర్ రెడ్డి టేకింగ్ లో ఉన్న లోపాలే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర సినిమా విషయంలో జరిగిన తప్పుల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు.
బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ మీదకు వెళ్లామని, ఈ సినిమా విషయంలో అదే పెద్ద తప్పయిందని అన్నారు. ఏజెంట్ డిజాస్టర్ కి సంబంధించిన పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని చెప్పాడు. బౌండ్ స్క్రిప్ట్ లేకపోవటంతో పాటుగా కరోనా సమయంలో చాలాసార్లు షూటింగ్ వాయిదా పడటం వంటి పలు కారణాల వల్ల తమకి డిజాస్టర్ ఎదురైందని చెప్పుకొచ్చారు.
ఏజెంట్ లాంటి కాస్ట్లీ మిస్టేక్ ద్వారా పాఠం నేర్చుకొని ఇక మీదట ఇలాంటి పొరపాటు చేయబోమని తెలిపిన అనిల్ సుంకర, తమపై నమ్మకం పెట్టుకున్న వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నామని అన్నారు. ఏదేమైనా ఫ్లాప్ కి డైరెక్టర్ ని కానీ, ఇతరుల్ని కానీ కారణంగా చెప్తూ సమర్ధించుకోకుండా పూర్తి బాధ్యత తనదే అని తెలిపిన అనిల్ సుంకర కొంతమంది నిర్మాతలకి ఆదర్శం అని చెప్పాలి. మొత్తానికి తప్పు ఒప్పుకున్న నిర్మాత ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు