Tollywood: 2023 లో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ లో ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుంటారు. కానీ వాళ్లలో కొందరే సక్సెస్ అవుతారు. అయితే ఈ సక్సె అయిన హీరోయిన్లలో స్టార్ డమ్ వచ్చిన తరువాత రెమ్యూనరేషన్ పెంచేసి తక్కువ సినిమాలు చేస్తుంటారు. కానీ మరికొందరు హీరోయిన్లు మాత్రం రెమ్యూనరేషన్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంటారు. అలా ఈ ఇయర్ ఎక్కువ సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? అందరూ ఊహించినట్టుగానే శ్రీ లీలే 2023 లో ఎక్కువ సినిమాలు చేసింది.

2023 లో సెకండాఫ్ లో వరుస సినిమాలు చేసి ట్రెండ్ అయ్యింది. ధమాకా తో స్టార్ హీరోయిన్ అయిన శ్రీ లీల టాలీవుడ్ టాప్ హీరోల నుండి మీడియం రేంజ్, చిన్న హీరోలతో కూడా నటిస్తుంది. ఇక ఈ ఇయర్ నాలుగు సినిమాలతో సందడి చేయగా ఆ సినిమాల గురించి ఓ లుక్కిస్తే..

1). స్కంద :

- Advertisement -

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ హీరోగా నటించగా, శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ అవగా, ఓపెనింగ్స్ బాగా వచ్చినా రొటీన్ కంటెంట్ వల్ల ప్లాప్ అయింది.

2). భగవంత్ కేసరి:

బాలకృష్ణ హీరోగా నటించిన ఈ భగవంత్ కేసరిలో శ్రీ లీల హీరోయిన్ గా కాకుండా బాలయ్య కూతురిగా ప్రత్యేక పాత్రలో నటించింది. కానీ ఈ సినిమా కాన్సెప్ట్ శ్రీ లీల చుట్టే తిరగడంతో తనే హైలెట్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది.

3). ఆదికేశవ:

వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అయితే నవంబర్ 24న రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

4). ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్:

నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. ఇక వక్కంతం వంశి డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 8న రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే సరిగ్గా జరిగితే ఈ ఇయర్ శ్రీ లీల నటిస్తున్న గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్ కావాల్సింది. కానీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతున్నాయి. లేదంటే శ్రీ లీల ఖాతాలో మరో రెండు సినిమాలుండేవి.

ఇకపోతే శ్రీ లీల ఈ ఇయర్ ఎక్కువ సినిమాల్లో నటించినా ఒక్క భగవంత్ కేసరిలో తప్ప మిగతా అన్ని సినిమాలో గ్లామర్ ప్రాధాన్యం ఉన్న పాత్రలే కాగా, అన్ని ప్లాప్ అయ్యాయి. కానీ ఇన్ని ప్లాప్ అయినా శ్రీ లీల కెరీర్ కి వచ్చిన డోకా ఏం లేదు. ఎందుకంటే శ్రీ లీల చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు లైన్లో ఉండగా, అందులో రెండు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

For More Updates :Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు