Sharathulu Varthisthai : యూట్యూబ్ స్టార్ ఖాతాలో మరో ప్లాప్?

టాలీవుడ్ లో టాలెంట్ ని నమ్ముకుని వచ్చిన హీరోల్లో చైతన్య రావు ఒకరు. లాక్ డౌన్ లో యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ హీరో 31 వెడ్స్ 21 తో మంచి క్రేజ్ సంపాదించాడు. చిన్న పాత్రలతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అన్నపూర్ణ ఫోటో స్టూడియో అనే కామెడీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అంతగా ఆడకపోయినా, ఇతని యాక్టింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. ఇక లాస్ట్ ఇయర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడా కోలా సినిమా తో ఆడియన్స్ ని పలకరించిన ఈ హీరో ఆ సినిమాతో కూడా సరైన హిట్టు కొట్టలేకపోయాడు. ఇక తాజాగా “షరతులు వర్తిస్తాయి” అనే సినిమాతో హీరోగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్ లో శ్రీలత, నాగార్జున నిర్మించగా, కుమార స్వామి దర్శకత్వం వహించాడు. ఒక మిడిల్ క్లాస్ కామెడీ ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మార్చి 15 న థియేటర్ల ముందుకు వచ్చింది.

రొటీన్ స్క్రీన్ ప్లే..

ఇక చైతన్య రావు నటించిన షరతులు వర్తిస్తాయి సినిమా ట్రైలర్ పరంగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నా, థియేటర్ల లో రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుండి ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మిడిల్ క్లాస్ నేపథ్యంలో వచ్చిన చాలా సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన హీరోకి ఒక అమ్మ, తమ్ముడు, చెల్లి, ఇంకా ఒక హీరోయిన్. ఇలా సింపుల్ గా చూపించేసి మధ్య తరగతి కుటుంబాల కష్టాలు, బరువు బాధ్యతలతో కాస్త ఎంటర్టైనింగ్ గా చూపించాడు దర్శకుడు. అయితే స్క్రీన్ ప్లే డ్రామా పరంగా సినిమాని ప్రేక్షకులకి మెచ్చేలా తీయలేకపోయాడు డైరెక్టర్. ఇక ఈ సినిమాలో హీరో కరీంనగర్ కి చెందిన కుర్రాడు కాబట్టి, తెలంగాణ యాసలో పాత్రల్ని నడిపించిన విధానం బాగుంది. అయితే సినిమాలో ఎక్కువగా కొత్త వారినే యాక్టర్లుగా తీసుకున్నారు. ఆ పాయింట్ కూడా సినిమాకి మైనస్ అయిందని చెప్పొచ్చు.

- Advertisement -

అయితే ఇప్పటికే రెండు ప్లాపులతో సతమతమవుతున్న చైతన్య రావు కి షరతులు వర్తిస్తాయి సినిమాతో మరో ప్లాప్ పడినట్టే అంటున్నారు ట్రేడ్ విమర్శకులు. అయితే నటన పరంగా మంచి టాలెంట్ ఉన్న ఈ హీరో తన ఇమేజ్ కి తగ్గ కథలు ఎంచుకుంటున్నా, స్క్రీన్ ప్లే పరంగా ఆ సినిమాలు దెబ్బ తింటున్నాయి. రొటీన్ కథలు, రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల జనాలు అంతగా ఆదరించడం లేదు. కానీ మంచి కంటెంట్ తో వస్తే టాలెంట్ ఉన్న ఈ హీరోకి ఆడియన్స్ హిట్ ఇవ్వడం పెద్ద పనేమీ కాదు.ఇక ప్రస్తుతం చైతన్య రావు హెబా పటేల్ జంటగా హనీమూన్ ఎక్స్ ప్రెస్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఏప్రిల్ లో లేదా మే లో రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి టాలెంట్ ఉన్నా లక్ కలిసి రాని ఈ హీరోకి తర్వాతి సినిమాతో నైనా మంచి హిట్ దక్కుతుందేమో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు