RC15 : శంకర్ హై బడ్జెట్ ప్లాన్..

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న మరో భారీ చిత్రం RC15. ఈయన ఇప్పటికే భారతీయుడు, ఐ, రోబో, రోబో 2.o వంటి హై బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో RC15 ను తెరకెక్కిస్తున్నారు. ఇదే సమయంలో ఈయన కమల్ హాసన్ తో భారతీయుడు2 ను కూడా చేస్తున్నారు. ఇటీవల భారతీయుడు2 షూటింగ్ ను రీ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం దానికి బ్రేక్ ఇచ్చి RC15 ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న RC15కు కథను కార్తీక్ సుబ్బరాజ్ అందించగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నాడు. రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తుంది. రూ. 170 కోట్ల భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బడ్జెట్ మరింత పెరిగింది అని తెలుస్తోంది. అయితే దానిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. మధ్యలో కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. లీక్ అయిన ఫోటోలతోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతుంది. RC15లో ఒక పాట కోసం ఏకంగా రూ. 15 కోట్లు ఖర్చు చేయాలని డైరెక్టర్ శంకర్ భావిస్తున్నారట. అందుకు నిర్మాత దిల్ రాజు ను కూడా ఒప్పించాడని టాక్. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ ఈ వార్త నిజమే అయితే.. సౌత్ లోనే అత్యంత ఖరిదైన పాటగా నిలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు