Citadel: భార్యకు విడాకులు ఇచ్చిన హీరోతో ప్రేమాయణం నడుపుతున్న సమంత..!

నిత్యం ఏదో ఒక విషయంలో వార్తలలో నిలిచే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం, పెళ్లి, ఆ తరువాత విడాకులు.. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇక విడాకుల తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం గురించి కోకోల్లలుగా పుకార్లు వస్తున్నాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఆమె మాత్రం తన సినిమాలను తాను చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ దూసుకుపోతోంది. ఒకప్పుడు సౌత్ కే పరిమితమైన సమంత ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా హీరోయిన్ గా బిజీ అయ్యింది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులను చేస్తూ షూటింగులతో బిజీగా ఉంది సమంత.

ఈ క్రమంలోనే సమంతకి సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత తనకు ఓ తోడు కావాలని వెతుక్కుంటుందట. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం సమంత హీరో వరుణ్ ధావన్ తో ప్రేమలో పడిందని అంటున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా వీరిద్దరూ చట్టపట్టలేసుకొని తిరుగుతున్నారని టాక్. అయితే వీరిద్దరూ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి పబ్ లకు, పార్టీలకు తిరగడం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.

దీంతో వీరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని, డేటింగ్ చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని సినీ క్రిటిక్ ఉమైర్ సంధు సైతం తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వరుణ్ ధావన్ తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడని.. ఆ హీరో సమంతను లవ్ చేస్తున్నాడని, సమంతను పెళ్లి కూడా చేసుకుంటాడేమో అని అనుమానం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు