Sita Ramam : పాపం బుట్టబొమ్మ

మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో రెండో సారి నటించిన చిత్రం సీతారామం. ఈ సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అంతే కాకుండా మొదటి షో నుంచే హిట్ టాక్ ను తెచ్చుకుంది. అద్భుతమైన లవ్ స్టోరీలను తెరకెక్కించే హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు. అయితే సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా బాలీవుడ్ భామ మృణాల్ ఠాకుర్ నటించింది.

ఈ సినిమా హిట్ టాక్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో హీరోయిన్ మృణాల్ ఠాకుర్ కూడా ఒక్కరు. మృణాల్ ఠాకుర్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. సీత పాత్రలో మృణాల్ జీవించింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో మంచి స్థానాన్ని, గుర్తింపును దక్కించుకుంది మృణాల్. అయితే, ఈ పాత్రను మూవీ టీం ముందుగా మృణాల్ ఠాకుర్ కోసం అనుకోలేదట.

ముందుగా సీత పాత్ర కోసం టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ను టీం ఎంపిక చేసిందని సమాచారం అందుతుంది. సీత పాత్ర బాగుండటంతో పూజా కూడా ఒప్పుకుందట. కానీ కరోనా వైరస్ వ్యాప్తి వల్ల షూటింగ్ వాయిదా పడటంతో, పూజాకు డేట్స్ అడ్జస్ట్ కాలేదట. దీంతో అనుకొని పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి బుట్టబొమ్మ తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. అలా సీత పాత్రను పూజా హెగ్డే మిస్ చేసుకుంది. ఫైనల్ గా మృణాల్ ఠాకుర్ కు ఈ గోల్డెన్ ఛాన్స్ వచ్చి చేరింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు