Ram Pothineni: డబుల్ ఇస్మార్ట్ ఆగిపోయిందా?

Ram Pothineni:

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏ అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడమే గాకుండా, అటు హీరోకి, ఇటు డైరెక్టర్ కి మాస్ కం బ్యాక్ హిట్ ఇచ్చింది. లవ్ జోనర్ల వైపే వెళ్తున్న రామ్ ని మాస్ సినిమాల వైపునకు లాక్కొచ్చింది. ఇప్పుడు నాలుగేళ్ళ తర్వాత ఈ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” వస్తున్న సంగతి తెలిసిందే.

సమ్మర్ లో స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ వరుస షెడ్యూల్స్ జరుపుకుంది. ఇక నిర్మాత, దర్శకుడు పూరీయే అవడంతో పెద్దగా టైం గ్యాప్ తీసుకోలేదు. అయితే ఇప్పుడు కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరగడం లేదు. పైగా ఈ సినిమాకి సంబంధించి రెండు నెలలుగా ఏ అప్డేట్ కూడా రావడం లేదు. దాంతో కొంత మంది నెటిజన్లు ఈ సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం చేస్తున్నారు.

అయితే తాజాగా చిత్ర యూనిట్ వచ్చిన సమాచారం ప్రకారం డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ ఎక్కడా ఆగిపోలేదు. సినిమాకి గ్యాప్ వచ్చింది అంతే. ప్రస్తుతం రామ్, బోయపాటి శ్రీను తెరకెక్కించిన స్కంద సినిమా షూటింగ్ పనుల్లో ఉన్నాడు, కాబట్టి పూరి సినిమాకి కొంత గ్యాప్ ఇచ్చాడని తెలుస్తుంది. అంతే కాక మరో నెలరోజుల వరకు స్కంద సినిమా ప్రమోషన్లో ఉంటాడు. అందువల్ల డబుల్ ఇస్మార్ట్ సెట్స్ లో రామ్ అడుగు పెట్టేది స్కంద రిలీజ్ తర్వాతే అని తెలుస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు