Rajinikanth : కుమార్తె దర్శకత్వంలో

స్టైల్ కి కేరాఫ్ అడ్రస్, తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో “జైలర్” అనే సినిమాలో నటిస్తున్నారు. రజనీకాంత్ నటిస్తున్న 169వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ లో సూపర్ స్టార్ సరికొత్త అవతారంలో కనిపిస్తారని తెలుస్తోంది.

ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా అనంతరం తలైవా ” లైకా” ప్రొడక్షన్స్ బ్యానర్ లో మరో రెండు చిత్రాలు చేస్తారని ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ రెండు చిత్రాలలో ఓ సినిమాకి రజినీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇంతకు ముందే ఐశ్వరత్రి ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమాకు దర్శకత్వం వహించారు.

ఇప్పటికే రజనీకాంత్ తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ” కొచ్చడయాన్” అనే ఓ యానిమేషన్ మూవీని చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ రజినీకాంత్ కెరీర్ లోనే ఆల్టైమ్ టాప్ డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. తమిళం తో పాటు, తెలుగు, మలయాళం, మరాఠీ, భోజ్పురి, బెంగాలీ భాషల్లో రిలీజ్ అయి టాప్ డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రజినీకాంత్ తన పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో మరో సినిమాని చేయబోతున్నారట. ఐశ్వర్య చెప్పిన కథ రజనీకాంత్ నచ్చడంతో.. లైకా సంస్థ కూడా ఓకే చెప్పిందని, త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులలో ఆసక్తి నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు