Salaar First Review: “సలార్” ఫస్ట్ రివ్యూ

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీని థియేటర్లలో వీక్షించడానికి ఆయన అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండగా మూవీ ఎలా ఉందన్న విషయం బయటకు వచ్చింది. మరి “సలార్” మూవీ ఎలా ఉండబోతోంది? ఫస్ట్ రివ్యూ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో, గ్లామరస్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. కేజిఎఫ్ మూవీ తో సత్తా చాటిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ సినిమాపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర బృందం చాలా స్లోగా ఉంది. అయినప్పటికీ డైనోసార్ ఎంట్రీ గురించి ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. “బాహుబలి” తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేక పోయిన ప్రభాస్ ఈ మూవీతోనైనా మళ్లీ అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాస్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ మూవీపైనే పెట్టుకున్నారు. మరి ఇంతకీ ఫస్ట్ రివ్యూ ప్రకారం ఈ మూవీ ఎలా ఉందంటే…

“సలార్” మూవీ ఫస్ట్ రివ్యూ ప్రకారం ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంటుందని, సెకండ్ హాఫ్ డీసెంట్ గా ఉండి ఆకట్టుకుంటుందని, ఇక క్లైమాక్స్ అయితే బీభత్సమేనని తెలుస్తోంది. సినిమాలో క్లైమాక్స్ తో కలిపి మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయట. ఆ మూడు సన్నివేశాలు థియేటర్లు బద్దలయ్యేలా చేస్తాయట. ఇక సినిమాకు బిజిఎం అదిరిపోయిందని, ప్రభాస్ స్టైలిష్ యాక్షన్ ఒకవైపు, అదిరిపోయే బిజిఎం మరోవైపు ప్రేక్షకులను ఇస్తాయని చెప్పుకొస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఈ మూవీతో ప్రభాస్ పక్కా మాస్ కా బాస్ అనిపిస్తాడని, యాక్షన్ బ్లాక్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మాస్ ఫీస్ట్, కిక్ ఇచ్చే విలన్ల ఊచకోత, కథలో ట్విస్ట్, ఎమోషన్స్ అన్ని సరిపడా ఉన్నాయని తెలుస్తోంది. “సలార్” మూవీతో ప్రభాస్ మళ్లీ గెట్ బ్యాక్ అవుతాడనీ అంటున్నారు. చాలావరకు ఈ సినిమాపై పాజిటివ్ టాక్ నడుస్తోంది. మరి ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు ఎలాంటి తీర్పు వస్తుందో తెలియాలంటే డిసెంబర్ 22 దాకా ఎదురు చూడాల్సిందే.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు