Gopichand : ప్రభాస్ కు డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో గోపీచంద్ నెక్స్ట్ ప్రాజెక్ట్?

Gopichand

మాచో హీరో గోపీచంద్, రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనుందనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అయితే తాజాగా వీళ్ళిద్దరి కాంబో పట్టాలెక్కే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ ఏంటి? అంటే…

టాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్ కు ప్రస్తుతం అస్సలు టైం బాలేదు. ఆయన ఎంత ప్రయత్నిస్తున్నా ఒక్క హిట్ కూడా పడడం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్న మిడ్ రేంజ్ హీరోలతో పోలిస్తే గోపీచంద్ బాగా వెనకబడిపోయాడు. “జిల్” తర్వాత ఈ హీరోకు అలాంటి బ్లాక్ బస్టర్ పడనేలేదు. ఆయన హిట్ అనే మాట విని దాదాపు దశాబ్దం గడుస్తోంది. కానీ గోపీచంద్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చే డైరెక్టర్ దొరకనే దొరకట్లేదు. గత ఏడాది ఆయన నటించిన “రామబాణం” మూవీ రిలీజ్ అయింది అన్న విషయం కూడా టాలీవుడ్ ఆడియన్స్ కి తెలియదు. ఇక ఈ ఏడాది కూడా “భీమా” అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి గోపీచంద్ రెడీగా ఉన్నాడు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇక మరోవైపు డైరెక్టర్ రాధాకృష్ణకు కూడా దాదాపుగా ఇదే సిచువేషన్.

“జిల్” సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన ఈ దర్శకుడికి మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మంచి పేరు వచ్చింది. “జిల్”తో గోపీచంద్ కు కెరీర్లో మర్చిపోలేని మంచి మూవీని ఇచ్చాడు. ఆ తర్వాత సెకండ్ మూవీనే పాన్ ఇండియా ఛాన్స్ రావడంతో అదృష్టం అంటే ఈ డైరెక్టర్ దే అనుకున్నారు అందరూ. ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ రావడంతో రాధాకృష్ణ కెరియర్ టర్న్ అయినట్టే అనుకున్నారు.

- Advertisement -

అనుకున్నట్టుగానే రాధాకృష్ణ కెరీర్ టర్న్ అయింది. ఆయనతో సినిమా చేయడానికి హీరోలు భయపడే రేంజ్ కి వెళ్ళిపోయింది. “రాధే శ్యామ్”తో ప్రభాస్ కు ఊహించని విధంగా భారీ డిజాస్టర్ ఇవ్వడంతో ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తిని కనపరచలేదు. పైగా ఆ షాక్ నుంచి చేరుకోవడానికి దాదాపు రాధాకృష్ణకు రెండేళ్లు పట్టింది. అంతలోపు తన దగ్గరున్న స్టోరీతో పలువురు హీరోలను కలిసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో చివరగా మళ్లీ గోపీచంద్ దగ్గరకి వచ్చి ఆగాడు.

గతంలో వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన “జిల్” మ్యాజిక్ రిపీట్ అవ్వాలనే ఆశతో గోపీచంద్ హీరోగా, రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక కొత్త ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది. అదికూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. 70 కోట్ల భారీ బడ్జెట్ తో వార్ నేపథ్యంలో రూపొందనున్న ఈ యాక్షన్ డ్రామాను యువి క్రియేషన్స్ నిర్మించబోతోంది. ఈ మూవీలో ఎక్కువ భాగం ఫారిన్లోనే షూటింగ్ జరగబోతుంది అని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు