NBK107 : దసరాకు మాస్ ట్రీట్ ?

నంద‌మూరి న‌టసింహం బాల‌య్య ప్ర‌ధాన పాత్ర‌లో తాజాగా తెర‌కెక్కుతున్న చిత్రం NBK107. ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వ‌హిస్తున్న విషయం తెలిసిందే. అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బాల‌య్య ఈ చిత్రం చేస్తున్నారు. ఇప్పటి వ‌ర‌కు ఈ చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను భారీగా పెంచాయి. అలాగే బాల‌కృష్ణ మాస్ క్రేజ్ కు తోడు.. సక్సెస్ ఫుల్ ద‌ర్శ‌కుడిగా పేరున్న దర్శకుడు గోపీచంద్ మలినేని కూడా ఈ సినిమాపై ప్ల‌స్ పాయింట్ కానున్నారు. గోపీచంద్ మలినేని తెర‌కెక్కించిన క్రాక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలుసు.

అయితే ఈ చిత్రానికి ఇప్పటి వ‌ర‌కు టైటిల్ ను ఫిక్స్ చేయ‌లేదు. సినిమా టైటిల్ ఏమిటి అనే విషయంలో అనేక రకాల కథనాలు వ‌చ్చాయి. ఇప్ప‌టి వరకు వినిపించిన టాక్ ప్రకారం అయితే ఈ సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు అన్న గారు అనే టైటిల్ కూడా ప‌రిశీలిన‌లో ఉంద‌ని తెలుస్తోంది. అలాగే మ‌రికొన్ని టైటిల్స్ ను కూడా ప‌రిశీలిస్తున్న స‌మాచారం అందుతుంది. టైటిల్ విష‌యంలో చిత్ర యూనిట్ చేస్తున్న ఆల‌స్యం వ‌ల్ల టైటిల్ పై ఆస‌క్తి రోజు రోజుకు పెరుగుతుంది.

ప్ర‌స్తుతం టైటిల్ పై త్వరగా క్లారిటీ ఇవ్వాలి అని చిత్ర యూనిట్ సభ్యులతో బాలకృష్ణ మాట్లాడినట్లు తెలుస్తుంది. దీంతో చిత్ర యూనిట్ టైటిల్ పై ఫోకస్ చేశార‌ట‌. ద‌సరా సంద‌ర్భంగా టైటిల్ ను అధికారికంగా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం అందుతుంది. ఒక వేళ ఈ ద‌స‌రాకు బాల‌య్య సినిమా టైటిల్ వ‌స్తే నంద‌మూరి అభిమానుల‌కు డ‌బుల్ డోస్ ఎంజాయ్ ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు