Akkineni Family: ఆయన చేసిన మిస్టేక్ వల్లనే నాగచైతన్య టాప్ హీరో కాలేకపోయాడా..?

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నాగార్జున. టాలీవుడ్ టాప్ 3 హీరోగా ఆయన రెండు దశాబ్దాల పాటు కొనసాగాడు. ఇక నాగార్జున తర్వాత అక్కినేని వంశం నుంచి వచ్చిన మరో హీరో నాగచైతన్య. జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నాగచైతన్య తన ప్రతి చిత్రంలోను వైవిధ్యం ప్రదర్శించడానికే తపిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీకి అచ్చొచ్చిన రొమాంటిక్ స్టోరీస్ తోనే నాగచైతన్య ఫ్యాన్స్ ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నాగచైతన్య ఇప్పటికీ స్టార్ హీరో హోదా సంపాదించుకోలేకపోయాడు.

ఒక లెజెండ్ కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఇన్నాళ్లు అయినా కూడా నాగచైతన్య ఇంకా స్టార్ కాకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే నాగచైతన్య స్టార్ హీరో కాకపోవడానికి నాగార్జున కూడా ఓ కారణమంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ శికారు చేస్తుంది. నాగార్జున నాగచైతన్య కి సెట్ అయ్యే క్లాస్ సినిమాలు చేయమని చెప్పడంతో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 100% లవ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా మంచి సక్సెస్ ని కూడా సాధించింది. ఇలాంటి సినిమాలు చేస్తే నాగచైతన్య టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా మిగిలేవాడు. ఇప్పుడు అటు మాస్.. ఇటు క్లాస్ కాకుండా పోయాడు.

అంతేకాకుండా నాగచైతన్య మొదటి సినిమా జోష్ ని దిల్ రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఈ సినిమాకి బదులుగా నాగచైతన్యతో మొదట దిల్ రాజు అనుకున్న చిత్రం కొత్త బంగారులోకం సినిమా. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. అయితే ఈ మూవీ స్టోరీని తొలుత నాగార్జునకి వినిపించారట దిల్ రాజు. అయితే ఈ స్టోరీని నాగార్జున రిజెక్ట్ చేశారట. ఈ సినిమాతో గనుక నాగచైతన్య లాంచ్ అయి ఉంటే ఆయన కెరీర్ వేరే లెవెల్ లో ఉండేదని అక్కినేని అభిమానుల అభిప్రాయం. మరోవైపు నాగార్జున క్లాస్ సినిమాలు చేయమని చెప్పడం వల్లే నాగచైతన్య స్టార్ హీరో కాలేకపోయాడని సోషల్ మీడియాలో ఓ రూమర్ తెగ వైరల్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు