Nani: మెహ్రీన్ కు మెగా కాంపౌండ్ లోకి నో ఎంట్రీ… ఇదా అసలు కారణం ?

“కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” అనే సినిమాలో నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్ గా నటించి, టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. మొదటి సినిమాలో ముద్దుగా బొద్దుగా ఉన్న మెహరీన్ తెలుగు ప్రేక్షకులకు భలే నచ్చేసింది. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక యంగ్ హీరోలతోనూ పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ హిట్స్ అయితే పడలేదు. పైగా ఇటీవల కాలంలో వరుసగా ప్లాపులు ఎదురవడంతో బాగా అవకాశాలు తగ్గాయి. “ఎఫ్ 2″లో హనీ ఈజ్ ద బెస్ట్ అనిపించుకుంది కానీ, మంచి అవకాశాలను మాత్రం రాబట్టుకోలేకపోయింది. మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్ ఈ హీరోయిన్ పై ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.

సాధారణంగా ఒక్క మెగా హీరోతో నటించే అవకాశం వచ్చినా టాలీవుడ్ లో ఆ హీరోయిన్ పంట పండినట్టే. కాజల్ అగర్వాల్, శృతిహాసన్ లాంటివారు ఇలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు. మెగా కాంపౌండ్ లో దాదాపుగా పదిమంది దాకా హీరోలు ఉండడంతో, ఒకరితో నటించి హిట్ కొడితే ఆ తర్వాత మెగా కాంపౌండ్ హీరోలతోనే వరుసగా నటించే ఛాన్స్ దానంతట అదే తెరుచుకుంటుంది. కానీ మెహరీన్ కు మాత్రం ఆ అదృష్టం దక్కనే లేదు. తాజాగా మెహరీన్ మాట్లాడుతూ దానికి కారణం ఏంటో వెల్లడించింది.

“కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” తర్వాత వరుసగా 6 ప్రాజెక్టులకు సైన్ చేశాను. ఈ బిజీలో తొలిప్రేమ (2018) చిత్రాన్ని వదులుకున్నాను. ఇంకా అలాంటి మంచి సినిమాలు చాలా వదులుకోవాల్సి వచ్చింది” అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ‘తొలిప్రేమ’ మూవీలో వరుణ్ తేజ్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. వెంకీ అట్లూరి ఈ మూవీని డైరెక్ట్ చేయగా, ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఇటు వరుణ్, అటు రాశి కెరీర్లకు మంచి బూస్ట్ ఇచ్చింది. మరి అలాంటి మూవీని మెహరీన్ చేజార్చుకోవడం ఆమె అదృష్టమని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ “స్పార్క్” అనే బైలింగ్వల్ మూవీ చేస్తోంది. మరో కన్నడ మూవీ కూడా మెహరీన్ చేతిలో ఉంది. కానీ తెలుగు లో మాత్రం ఆఫర్స్ ఈ బ్యూటీ ఇంటి తలుపు పెద్దగా తట్టడం లేదని చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు