Mega Family: మెగా వెడ్డింగ్ లో ఆ ఇద్దరు ఉండడం మెగాఫ్యాన్స్ కే నచ్చలేదా?

టాలీవుడ్ లో మరో ప్రేమ జంట ఒకటైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎప్పట్నుంచో ప్రేమించుకోగా, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో నవంబర్ 2న ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. అతి తక్కువ బంధు మిత్రుల సమక్షంలో ఇటలీ లో ఘనంగా జరిగిన వీరి పెళ్ళి హిందూ సంప్రదాయంలో జరిగింది.

ఇక ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరవగా, స్పెషల్ అట్రాక్షన్ గా మెగా అన్నదమ్ములు నిలిచారు. చాలా ఏళ్ళ తర్వాత మెగా ఫ్యామిలీ ఈ పెళ్లి వేడుక ద్వారా నిండుగా కనిపించిందని మెగా ఫ్యాన్స్ చాలా సంతోష పడ్డారు.

అయితే ఇదే వెడ్డింగ్ లో ఓ ఇద్దరు ఉండడం ఆడియన్స్ కి అంతగా నచ్చలేదు. వాళ్ళకే కాదు ఓ రకంగా మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదని టాక్ వచ్చింది. అయితే వేడుకకి ఇండస్ట్రీ నుండి పెద్దగా ప్రముఖులు ఎవ్వరూ వెళ్ళలేదు. మరి మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చని వారు ఎవరై ఉంటారు.. అని డిస్కషన్ చేస్తుంటే, సోషల్ మీడియా లో రివీల్ అయింది.

- Advertisement -

మెగా ఫ్యాన్స్ కి నచ్చని ఆ ఇద్దరూ మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లే కావడం ఆసక్తిగా మారింది. ఆ ఇద్దరూ ఎవరో కాదు చిరు చిన్న కూతురు శ్రీజ, అలాగే నాగబాబు కూతురు నిహారిక..

కొన్నేళ్ల కిందట చిరంజీవి ఫ్యామిలీ నుండి విడిపోయి వేరే అతడ్ని ప్రేమ వివాహం చేసుకున్న శ్రీజ అప్పట్లో ఫ్యామిలీకి అగైనిస్ట్ గా వెళ్లి పరువు తీసింది. తిరిగి మొదటి భర్త నుండి విభేదాల కారణంగా విడిపోయి మళ్ళీ తండ్రి గూటికి చేరింది. తండ్రి ప్రేమతో దగరికి తీసుకుని మరో పెళ్ళి చేయగా, పెళ్ళైన రెండేళ్ళకి అతని నుండి కూడా విడిపోయి మెగా ఫ్యామిలీ లో ఒక మాయని మచ్చ మిగిల్చింది.

ఇలాగే నాగబాబు కూతురు నిహారిక కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా, అక్క నుండి ఇన్స్పైర్ అయ్యి చిన్న చిన్న విభేదాల కారణంగానే భర్త నుండి విడిపోయింది. అయితే ఈ ఇద్దరు మెగా కూతుళ్ళ వల్ల మెగా ఫ్యామిలీ పరువు పోయిందని ఫ్యాన్స్ బాధ పడుతూ ఉంటారు.

ఇక పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కూడా లో ఉండడం వల్ల ఫ్యామిలీ లో భాగంగా వీళ్ళ టాపిక్ తీసి ప్రతిపక్షం ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా వీళ్ళు వరుణ్ లావణ్య పెళ్ళిలో సందడి చేయడం మెగా ఫ్యాన్స్ కి సైతం అంతగా నచ్చలేదని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇలాంటివి ఈ రోజుల్లో చాలా కామన్, ఇలాంటి శుభ సందర్భాల్లో కూడా నెగిటివ్ గా మాట్లాడడం సరికాదని మరి కొందరు అభిమానులు భావిస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు