Tollywood: హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించుకున్న స్టార్స్

నందిని రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా అలా మొదలైంది. ఈ సినిమాలో నాని మెయిన్ రోల్ లో నటించిన సంగతి మనకు తెలిసిందే. అయితే నాని ఒక సమస్య వలన డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ సమస్య ఏంటో కాదు హెయిర్ ఫాల్. అయితే ఈ సీన్ సినిమాలో చూసినప్పుడు కొంచెం ఫన్నీగా అనిపించినా కూడా, ఇది కొంతమంది సెలబ్రిటీస్ విషయంలో సీరియస్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రేక్షకులను అలరిస్తున్న చాలామంది స్టార్ హీరోలకు హెయిర్ స్టైల్ అనేది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

లేకపోతే తెలుగులో కొంతమంది హీరోలు హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. అయితే మహేష్ బాబు ఒక్కడు అతడు పోకిరి అర్జున్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నాడని చెప్పవచ్చు. అయితే అతిధి సినిమాలో మహేష్ హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అతిధి సినిమా టైమ్ లోనే మహేష్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేసుకున్నట్లు అప్పట్లో చాలా కథనాలు వినిపించాయి. ఇకపోతే ఇప్పుడు మహేష్ హెయిర్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. గుంటూరు కారం సినిమాలో అయితే మహేష్ హెయిర్ స్టైల్ కి చాలా మంది ఫిదా అయ్యారు.

నిన్ను చూడాలని సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎన్టీఆర్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచాయి. అయితే ఎన్టీఆర్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించుకున్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి.

- Advertisement -

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎస్ఎస్ థమన్ ఒకరు. అయితే తమన్ హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించుకున్న విషయం ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పట్లో బృందావనం, బిజినెస్ మేన్, దూకుడు, వంటి సినిమాలకి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన తమన్ అప్పట్లో స్టేజ్ పెర్ఫార్మెన్స్ లో కూడా కనిపించేవారు. అప్పుడు థమన్ హెయిర్ స్టైల్ కి ఇప్పుడు థమన్ హెయిర్ స్టైల్ కి డిఫరెంట్ మనకు క్లియర్ గా అర్థమవుతుంది.

ప్రభాస్ నటించిన మిర్చి సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన కొరటాల శివ. ఆ సినిమా తర్వాత కొరటాల శివ శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి వరుస సినిమాలు చేసే అద్భుతమైన హిట్స్ అందుకున్నాడు. అయితే శివ నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఆశ్చర్య సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఇకపోతే కొరటాల శివ కూడా హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించుకున్న విషయం రీసెంట్ గా దేవర సినిమాకి సంబంధించిన వీడియోలు చూస్తే అర్థమవుతుంది.

ఈ రోజుల్లో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు మారుతి. అయితే మారుతి అప్పటి హెయిర్ స్టైల్ కి ఇప్పటి హెయిర్ స్టైల్ కి తేడాను చాలా ఈజీగా గమనించవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు సమాచారం.

మణిరత్నం దర్శకత్వం వహించిన రోజా బొంబాయి వంటి సినిమాలు తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అరవింద్ స్వామి. అయితే అరవింద్ స్వామి కి ఉన్న అందం గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు. చాలా తమిళ్ సినిమాల్లో అరవింద్ స్వామి తన ప్రతిభను కనబరిచారు. అయితే అరవింద్ స్వామి కూడా హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించుకున్నారు.

ఇక పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి మనకు తెలిసిన విషయమే. ఆర్య సినిమా అప్పటినుంచి అల్లు అర్జున్ ని గమనిస్తే సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రాసెస్ లోనే బన్నీ కూడా హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించుకున్నారు.

టీవీలో ఎన్నో రియాల్టీ షోస్ తో పాపులర్ అయ్యారు యాంకర్ ఓంకార్. ఒకప్పుడు ఓంకార్ షో అంటేనే చాలామంది 90s పీపుల్ కి బాగా కనెక్ట్ అయ్యేది. అంత అద్భుతంగా రియాల్టీ సోషల్ డిజైన్ చేసేవాడు ఓంకార్. అయితే ఓంకార్ హెయిర్ స్టైల్ ని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఓంకార్ ను చూసినప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించారని ఈజీగా అర్థమయిపోతుంది.

కేవలం మీ హీరోలు మాత్రమే కాకుండా సత్యదేవ్ విశ్వక్సేన్ వంటి హీరోలు కూడా హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించారు. ఇకపోతే ఇప్పటికే ప్రభాస్ మూడుసార్లు చేయించినట్లు తెలుస్తుంది కానీ మూడుసార్లు కూడా ఫెయిల్ అయిందనేది సమాచారం. కానీ దీనిలో వాస్తవం ఎంతవరకు అనేది ఎవరికి తెలియదు. అలానే దర్శకుడు క్రిష్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ చేయించుకున్నారు.

అయితే హెయిర్ ట్రాన్స్ప్లేన్టేషన్ అనేది చిన్నగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏమీ కాదు. తమలో తమకి కాన్ఫిడెన్స్ పోకుండా ఉండడానికి. ఇతరులకు కూడా అందంగా కనిపించడానికి ఇలా చేయడం అనేది సహజమే.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు