Balakrishna: బాలయ్య పై అనుచిత వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్..!!

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి.. నటన గురించి.. ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. అయితే బాలకృష్ణ కోపిష్టి అని చాలామంది తెలియజేశారు.. కానీ దగ్గర్నుంచి చూసినవారు మాత్రం బాలకృష్ణ మనసు గురించి తెలియజేస్తూ ఉంటారు. తాజాగా బాలకృష్ణతో కలిసి రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ ఇప్పుడు బాలకృష్ణ పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అభిమానులను ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి.. బాలకృష్ణ హీరోగా 2018 లో వచ్చిన జై సింహా సినిమాతో పాటు 2019లో వచ్చిన రూరల్ అనే సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ కె ఎస్ రవికుమార్..

నటుడిగా మారిన డైరెక్టర్..
ఆ తర్వాత డైరెక్టర్ గా పూర్తిగా దూరమై నటన మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పలు సినిమాలలో నటించారు.. ప్రస్తుతం రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో చేస్తున్నారు రవి కుమార్.. తాజాగా గార్డియన్ అనే తమిళ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కె ఎస్ రవికుమార్ నందమూరి బాలకృష్ణ పైన పలు వ్యాఖ్యలు చేశారు.. బాలకృష్ణకి షూటింగ్లో ఎవరైనా నవ్వుతూ ఉంటే వెంటనే కోపం వచ్చేస్తుందని ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి మరి కొడతారంటూ రవికుమార్ వెల్లడించారు..

బాలకృష్ణ కోపంపై కామెంట్స్..
అలా ఒక సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో తన అసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్ ను ఫ్యాన్ తిప్పమని చెప్పానని.. కానీ అతను అనుకోకుండా ఆ ఫ్యాన్ ని బాలకృష్ణ వైపుగా తిప్పారని.. ఆ వెంటనే తాను పెట్టుకున్న విగ్గు కాస్త అటు ఇటుగా మారిపోయింది.. ఈ విషయం చూసి శరవణన్ కాస్త నవ్వుకున్నారని వెల్లడించారు.. అలా చూడగానే బాలకృష్ణలో వెంటనే కోపం రగిలిపోయింది.. ఎందుకు నవ్వుతున్నావ్ అంటూ గట్టిగా అరిచేశారని వెల్లడించారు.. దీంతో తన అసిస్టెంట్ డైరెక్టర్ ని బాలయ్య ఎక్కడ కొడతాడో అని వెళ్లి.. సార్ అతను మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పానని వెల్లడించారు…

- Advertisement -

క్లారిటీ ఇచ్చిన డైరక్టర్..
అయినప్పటికీ కూడా బాలయ్య అసలు కూల్.. కాలేదని వెంటనే నోరు మూసుకోమని అక్కడి నుంచి తన అసిస్టెంట్ డైరెక్టర్ ని పంపించేశానని వెల్లడించారు.. అప్పుడు ఆయన కాస్త స్థిమిత పడ్డారంటూ నందమూరి బాలకృష్ణ పైన కే ఎస్ రవికుమార్ తెలియజేశారు.. దీంతో బాలయ్య అభిమానులు మాత్రం.. బాలకృష్ణ వ్యక్తిత్వం తెలిసినవారు ఎవరు ఇలా మాట్లాడరని అసలు సినిమా అవకాశాలే లేని రోజుల్లో మిమ్మల్ని పిలిచి రెండు సినిమాలు అవకాశం ఇస్తే మీరు మా హీరో మీద ఇలాంటి నిందలు వేస్తారా అంటూ బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు