Janvi Kapoor : నోరు జారి బాయ్ ఫ్రెండ్ పేరు బయట పెట్టేసిన జాన్వీ

Janvi Kapoor : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ ప్రేమలో ఉందని చాలా కాలంగా హిందీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా ఆ రూమర్స్ పై నోరు విప్పని జాన్వి తాజాగా నోరు జారి బాయ్ ఫ్రెండ్ పేరు బయట పెట్టేసింది. ఆ పేరు విన్న జనాలు ఈ బ్యూటీ ఏకంగా మాజీ సీఎం కొడుకునే లైన్ లో పెట్టేసింది అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ జాన్వి కపూర్ బాయ్ ఫ్రెండ్ ఎవరు? అనే విషయంలోకి వెళ్తే…

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలుగా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. ఎప్పుడూ హాట్ గా కనిపిస్తూ, కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేసే ఈ బ్యూటీ కొంతకాలం నుంచి ప్రేమాయణం నడిపిస్తోంది అంటూ బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. నిజానికి ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచే జాన్వి బాయ్ ఫ్రెండ్స్, రిలేషన్ షిప్ అంటూ ఏదో ఒక రూమర్ బయటకు వస్తూనే ఉంది.

తాజాగా “కాఫీ విత్ కరణ్” ప్రోగ్రామ్ కు గెస్ట్ గా వచ్చిన జాన్వి పొరపాటున తన బాయ్ ఫ్రెండ్ పేరు బయట పెట్టేసింది. పాపులర్ బాలీవుడ్ టాక్ షో “కాఫీ విత్ కరణ్” 8వ సీజన్ లోని తాజా ఎపిసోడ్లో కపూర్ సిస్టర్స్ ఇద్దరూ పాల్గొన్నారు. జాన్వి కపూర్ తో పాటు, ఆమె సోదరీ ఖుషి కపూర్ కూడా ఈ షోలో సందడి చేశారు. ఇక ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా ఇద్దరు సెలబ్రిటీ సిస్టర్స్ పర్సనల్ లైఫ్, రిలేషన్షిప్, బాయ్ ఫ్రెండ్ వంటి అంశాల చుట్టూనే డిస్కషన్ నడిచింది.

- Advertisement -

ముందుగా వేదాంగ్ రైనా, ఖుషి కపూర్ డేటింగ్ విషయం గురించి కరణ్ ప్రశ్నించగా, ఖుషి “ఓం శాంతి ఓం” సినిమాలోని ఒక సీను గుర్తు చేసుకుంటూ తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని సమాధానం ఇచ్చింది. ఇక ఆ తర్వాత జాన్వి ఎవరిని డేట్ చేస్తుందంటూ ఖుషిని కరణ్ ప్రశ్నించాడు. ఆమె స్పందించే లోగానే జాన్వి మాట్లాడుతూ తాను కేవలం ముగ్గురినే డేట్ చేశాను అనే విషయాన్ని బయట పెట్టింది. బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పాలా అని ఖుషి అడగ్గానే జాన్వి కంగారు పడింది. ఇక కరణ్ అదంతా పక్కన పెట్టి “మీ స్పీడ్ డైల్ లిస్టులో ఉండే ముగ్గురు పేర్లు చెప్పండి” అని అడిగాడు.

వెంటనే జాన్వి “పాపా, ఖుషి, షీకు” అని చెప్పేసి ఆ తర్వాత నాలుక కరుచుకుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మనవడు షికార్ పహారియాను జాన్వి ముద్దుగా షీకు అని పిలిచింది. అతనొక బిజినెస్ మాన్ కాగా, గత కొంతకాలం నుంచి జాన్వి ఎక్కడుంటే అతను కూడా అక్కడే కనిపిస్తున్నాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే రూమర్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే జాన్వి ఫ్యాన్స్ తాజాగా జరిగిన “కాఫీ విత్ కరణ్” ఎపిసోడ్లో జాన్వి అతని పేరు చెప్పిన విధానం చూసి షికార్ తో ఆమె ప్రేమలో ఉంది అని ఫిక్స్ అయిపోయారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు