Lavanya Tripati: న్యూ ఇయర్ రిజల్యూషన్స్ బయట పెట్టిన మెగా కోడలు

Lavanya Tripati: మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొత్త ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టింది. ఇక ప్రతి ఏడాది న్యూ ఇయర్ రోజున తమ జీవితాల్లో కొత్త మార్పు రావడానికి ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. అలాగే లావణ్య కూడా నూతన సంవత్సరం సందర్భంగా తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో సోషల్ మీడియా ద్వారా బయట పెట్టింది. మరి ఈ మెగా కోడలు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2012లో టాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి అలరించింది. కాకపోతే ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది. అందం, మంచి అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడి క్రేజ్ మిడ్ రేంజ్ హీరోల దగ్గరే ఆగిపోయింది. కాగా రీసెంట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుని లావణ్య మెగా కోడలు అయిపోయిన విషయం తెలిసిందే.

కొన్నేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట గత ఏడాది ఏడడుగులు నడిచి, మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అయితే పెళ్లయ్యేదాకా వీరి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎక్కడా బయట పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటలీలో వరుణ్, లావణ్యల పెళ్లి సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య గ్రాండ్ గా జరిగింది. అనంతరం హైదరాబాదులో వీళ్లు రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లిపోయారు ఈ జంట.

- Advertisement -

తాజాగా లావణ్య త్రిపాఠి కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటన్న విషయాన్ని ప్రకటించింది. తన అభిమానులందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఇంస్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. న్యూ ఇయర్ తను మరింత మానవత్వంతో ఉండాలని, సోషల్ మీడియాకు తక్కువ టైం కేటాయిస్తూ ప్రకృతితో ఎక్కువ సమయం మమేకం అవ్వాలని, తనపై తనకు మరింత ప్రేమ పెరగాలని కోరుకుంటున్నాను అని రాసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చూసిన అభిమానులు భారీ ఎత్తున లావణ్యకు న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్నారు.

ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు వరుణ్ “మట్కా” అనే మూవీతో పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే లావణ్య త్రిపాఠి కూడా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆమె చేతిలో ఒక మూవీ, ఒక వెబ్ సిరీస్ ఉన్నట్టు సమాచారం.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు