Namratha: భార్య నమ్రతతో అలా ఉన్న పర్సనల్ ఫొటో లీక్ చేసిన మహేష్

Namratha: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు – నమ్రత. వంశీ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమబంధంగా మారి 2005 ఫిబ్రవరి 10న వివాహ బంధంగా మారింది. వీరికి బాబు గౌతమ్ ఘట్టమనేని.. కూతురు సితార ఘట్టమనేని ఉన్నారు. ఇక మహేష్ కి మొదటి నుండి సినిమాలు, ఫ్యామిలీ.. ఇది తప్ప వేరే ప్రపంచంలో లేదన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఇక కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు మహేష్. ఈ క్రమంలోనే తనకి సంబంధించిన విషయాలన్నింటినీ ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే మహేష్ బాబు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఫ్యామిలీతో దుబాయ్ లో జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా మహేష్ తన భార్య నమ్రతని కౌగిలిలో బంధించి ఆమెకి ముద్దు పెడుతూ ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Mahesh leaked a personal photo with his wife Namrata

- Advertisement -

దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు.. ఖలేజా సినిమాలో మహేష్.. బ్రహ్మానందం ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ హీరోయిన్ అనుష్క ఏడుస్తుంటే.. ఆమెను ఓదారుస్తారు. ఈ స్టిల్ కూడా అచ్చం అలానే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి “దేవుడు ఓదార్చుతున్నాడు” అనే క్యాన్షన్‌ను అభిమానులు రాసుకొస్తున్నారు. ఇక ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు