Kushi: విజయ్ – సమంతల ‘ఖుషి’ స్టోరీ ఇదేనా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తర్వాత డీలా పడ్డ సంగతి తెలిసిందే. లైగర్ డిజాస్టర్ అయిన ప్రభావంతో పూరి, విజయ్ తో ప్లాన్ చేసిన ‘జనగణమన’ ప్రాజెక్ట్ కూడా అటకెక్కిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సమంతతో కలిసి నటిస్తున్న ఖుషి సినిమా మీదనే విజయ్ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలం అవుతున్నా సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ కాలేదు. ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. పవన్ కళ్యాణ్ సినిమా ‘ఖుషి’ బ్లాక్ బస్టర్ కాబట్టి ఈ టైటిల్ విజయ్ కి కూడా కలిసొస్తుందని అంటున్నారు.

ఈ క్రమంలో ఈ సినిమా స్టోరీ విషయంలో ఒక ఇంట్రస్టింగ్ అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. అదేంటంటే, ఈ సినిమా కథకి, పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కథకి సిమిలారిటీస్ ఉన్నాయట.ఈ వార్త సినిమాపై అంచనాలు మరింత పెంచుతుంది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో ;ఇగో’ కాన్సెప్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. విజయ్ ఖుషీలో కూడా ‘ఇగో’ కాన్సెప్ట్ కి ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు. ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోకుండా డీప్ లవ్ లో పడిన విజయ్ సమంత, ఆ తర్వాత ఇగో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయి తిరిగి ఎలాంటి పరిణామాల వల్ల కలుస్తారనేది కథ అని అంటున్నారు.

లైగర్ సినిమా డిజాస్టర్ అవటంతో డీలా పడ్డ విజయ్, ఇటీవల శాకుంతలం ద్వారా డిజాస్టర్ చవి చుసిన సమంత కాంబినేషన్లో రానున్న ఈ సినిమా ఇద్దరి కెరీర్లకు  కీలకంగా మారింది. పైగా పాత ఖుషి సినిమా కథకు ఈ సినిమా కథకు పోలిక ఉండటం సినిమాపై ఆసక్తి పెంచుతోంది. మరి ఈ సినిమా కథపై వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు