Adipurush: బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనా…? 

భారీ అంచనాల నడుమ విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫస్ట్ వీకెండ్ కి మంచి కలెక్షన్స్ రాబట్టినా సోమ, మంగళవారాల కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోయాయి. సినిమాని రోజుకొక వివాదం చుట్టుముడుతూ ఉండటం ఒక కారణం అయితే, సోషల్ మీడియాలో నెలకొన్న నెగిటివిటీ కూడా మరో కారణం అని చెప్పాలి. మొదటి మూడు రోజులకు గాను, 340కోట్ల గ్రాస్ రాబట్టిన ఆదిపురుష్ మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో 5కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది. ఈ క్రమంలో ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ అవ్వటం కూడా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగు వర్షన్ ని పీపుల్స్ మీడియా కొనుగోలు చేయగా, బ్రేక్ ఈవెన్ అవ్వటానికి ప్రపంచవ్యాప్తంగా ఇంకా 75కోట్ల మేర వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే, ఆక్యుపెన్సీ లేని కారణంగా చాలా మల్టీప్లెక్స్ లలో స్క్రీన్ ల సంఖ్య తగ్గిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో 75కోట్లు రాబట్టాలంటే ఒకరకంగా అది అసాధ్యం అనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో ఆదిపురుష్ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం దర్శకుడు ఓం రౌత్ అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. రామాయణం లాంటి ఇతిహాసాన్ని సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇష్టానుసారం మార్చటం పట్ల హిందుత్వ సంఘాల నుండి సామాన్య ప్రేక్షకుల వరకు అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య కూడా ఆదిపురుష్ కి ఉన్న ఏకైక కలిసొచ్చే అంశం ఈ వారం పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవటమే.

స్కూల్ పిల్లలకు, అనాధలకు స్పెషల్ షోలు వేస్తున్నప్పటికీ వాటి వల్ల వచ్చే షేర్ తో గట్టెక్కడం గగనమే అని చెప్పాలి. మొత్తానికి వెయ్యి కోట్ల టార్గెట్ తో భారీ ఎత్తున విడుదలైన ఆదిపురుష్ ఫ్లాప్, డిజాస్టర్ కి మధ్యలో ఆగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. రామాయణం లాంటి ఎపిక్ సబ్జెక్ట్ ని సినిమాటిక్ లిబర్టీ పేరుతో అవమాన పరిచిన ఓం రౌత్ అండ్ టీమ్ కి తగిలిన షాక్ ఇకమీదట పురాణం ఇతిహాసాల మీద సినిమా తీయబోయే వారికి ఒక హెచ్చరికగా నిలుస్తుందని చెప్పచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు