Dhamaka: బ్లాక్ బస్టర్ కాంబోలో మరోసారి క్రేజీ సినిమా?

మాస్ రవితేజ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. రీసెంట్ గా విడుదలైన “రావణాసుర” ప్లాప్ అయినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. అంతకు రెట్టింపు ఉత్సాహం తో, కసితో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు సినిమా షూట్ దాదాపుగా టాకీ పార్ట్ ఫినిష్ చేయగా మరో రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈగల్, కాగా మరొకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు.

అయితే తాజాగా రవితేజ తనకు “ధమాకా” లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తో సినిమా చేస్తున్నాడని సమాచారం అందింది. వీరి కాంబో లో వచ్చిన “ధమాకా” 2022 డిసెంబర్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాక రవితేజ కెరీర్ హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని వార్తలు వినబడుతున్నాయి. వీళ్ళ కాంబో లో తెరకెక్కబోయే సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడని టాక్.

అటు త్రినాథ రావు నక్కిన కూడా వరుసగా నాలుగు సినిమాలతో విజయాలు అందుకుని డబల్ హ్యాట్రిక్ హిట్లను సొంతం చేసుకోవాలని కలగంటున్నాడు. అయితే రవితేజ ధమాకా రిలీజ్ అయినప్పటినుంచే డైరెక్టర్ త్రినాథరావు తో మరో సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఈ సినిమా లో కూడా శ్రీ లీలనే హీరోయిన్ గా తీసుకోవచ్చని అంటున్నారు. అయితే ఈ సినిమా పట్టాలెక్కలంటే మరో 6 నెలల సమయం పట్టొచ్చు. ఎందుకంటే రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు రిలీజ్ అయ్యాకే ఇతర ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేయవచ్చు. ఇదే కాక ఈగల్ సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఆ సినిమా చేస్తూనే త్రినాథరావు సినిమాలోనూ నటించే అవకాశం ఉంది. మరి వీరి కాంబో లో సినిమా ఎప్పుడొస్తుందో తెలియాలంటే దిల్ రాజు అఫిషియల్ గా ప్రకటించేవరకు వెయిట్ చెయ్యాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు