Prabhas: సలార్ కి నిజంగా అంత సీన్ ఉందా?కెజిఎఫ్ కి ముందు ప్రశాంత్ నీల్ చేసిందేంటి ?

భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ ని , సినీ అభిమానులను తీవ్రంగా నీరాశపరచటంతో ఇప్పడు అందరి చూపు సలార్ సినిమాపైనే పడింది. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు సలార్ సినిమాకి పని చేస్తున్న వాళ్లంతా గతంలో కెజిఎఫ్ సినిమాకి పని చేయడంతో ఈ సినిమా రిజల్ట్ పై అంత ధీమాగా ఉన్నారు.

అయితే ఆదిపురుష్ సినిమా ముందు కూడా, సలార్ సినిమాలాగే చాలా పాజిటివ్ వాతావరణంలో సినిమా ప్రారంభించబడింది. షూటింగ్ కూడా అలాగే ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా సజావుగా కంప్లిట్ చేసారు. కానీ సినిమా వ్యవహారం అంత టీజర్ రిలీజ్ చేయడంతో బయట పడింది.

అప్పటిదాకా ప్రభాస్ రాముడిగా ఎలా ఉండబోతున్నాడో, రామాయణాన్ని ఎంత బాగా చుపించారో అని ఈగర్ గా వెయిట్ చేయగా, టీజర్ తో సినిమా ఎలాంటిదో అందరికి క్లారిటీ వచ్చింది. ఇక ఆ తరువాత వచ్చిన విమర్శలు, రీ-షూట్స్, గ్రాఫిక్స్ పై మళ్ళీ వర్క్ చేయడం ఇవన్నీ బోనస్.

- Advertisement -

ఇవన్నీ సరేసరి సినిమా రీ వర్క్ , రీ షూట్ ల వల్ల ఆదిపురుష్ సినిమా క్వాలిటీగా ఏమైన బయటికి వచ్చిందా అంటే అది లేదు. రామాయణంలో ఉన్న కనీస బేసిక్స్ పైన కూడా సినిమా తీయలేదని విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే ఈ విధంగా రిలీజ్ ముందు ఒక మాట , రిలీజ్ తరువాత ఇంకోమాట రావడం ప్రభాస్ సినిమాలకు ఇదేమి కొత్త కాదు బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన సాహూ, రాధేశ్యామ్, లేటెస్ట్ గా ఆదిపురుష్ అన్ని సినిమాల పరిస్థితి దాదాపుగా ఇంతే.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా రాబోతున్న సలార్ సినిమా కూడా అంచనాల్లో ఆకాశం చూపించి, సినిమాని నేలపై చుపిస్తారేమో అన్న ఆందోళన మొదలవుతుంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ విషయానికొస్తే ఈయన కూడా ఓం రౌత్ లాంటి దర్శకుడే అన్నట్టు తెల్సుతోంది.

ఆయన గతంలో తీసిన కన్నడ ఉగ్రం సినిమా, కెజిఎఫ్ పార్ట్1 సినిమాకి పెద్ద తేడా ఏమి కనిపించదు. ఇంకా పార్ట్ 2 విషయానికొస్తే లౌడ్ మ్యూజిక్, ఓవర్ ది టాప్ ఎలివేషన్స్ తప్ప గొప్పగా ఏముండదు. మరీ సినిమా అంతగా ఎలా ఆడింది అంటే సింపుల్ కెజిఎఫ్ పార్ట్1 మీద ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ అని చెప్పొచ్చు.

అయితే కెజిఎఫ్ లాంటి మాస్ మసాలా, ఓవర్ ది టాప్ ఎలివేషన్స్ ఉన్న సినిమాలు అన్ని సార్లు వర్క్ అవుట్ అవుతాయనేది చెప్పలేం. ఒక్కోసారి ఇలాంటి సినిమాలని నెత్తిన పెట్టుకునే జనాలు, ఆ తరువాత క్రింజ్ పేరుతో మూలాన పడేస్తారు. దీన్నిబట్టి చూస్తే సలార్ కూడా కూడా మరో రాధేశ్యామ్, ఆదిపురుష్ లాగ అంచనాల పెంచే సినిమా మాత్రమే అవుతుందా లేక నిజంగానే సినిమా ప్రేక్షకులను సంతృప్తి పరుస్తుందా అనేది చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు