Kamal : భారతీయుడు ఈజ్ బ్యాక్

కమల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ఇండియన్ 2. 1996 లో వచ్చిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది. 2017లో ఇండియన్2 ను తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ శంకర్, హీరో కమల్ హాసన్ అధికారికంగా ప్రకటించారు. 2019 నుంచి షూటింగ్ కూడా ప్రారంభమైంది. కానీ, ఈ చిత్రం షూటింగ్ సమయంలో ప్రమాదం జరగింది. అలాగే బడ్జెట్ విషయంలో డైరెక్టర్ శంకర్ కు లైకా ప్రొడక్షన్ మధ్య వివాదాలు వచ్చాయి. దీంతో ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

తాజాగా ఈ సినిమా షూటింగ్ ను పున:ప్రారంభిస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. ఆర్సీ 15 షూటింగ్ లో ఉన్న దర్శకుడు శంకర్ కూడా ఇండియన్ 2 కు సమయం కేటాయించడానికి సిద్ధమయ్యారు. ఆర్సీ 15 షూటింగ్ కు బ్రేక్ వేసి మరీ, ఇండియన్ 2 ను పట్టాలెక్కించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం పై ఒక అప్ డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. సెప్టెంబర్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుగుతుందని అధికారికంగా ప్రకటించారు.

అలాగే ఒక పోస్టరును కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కమల్ హాసన్ సీరియస్ లుక్ లో ఉన్నారు. అలాగే హీ ఈజ్ బ్యాక్ అని కూడా పోస్టర్ పై రాశారు. అలాగే తాజాగా ఇండియన్ 2 షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాసేపటి క్రితం మూవీ టీం పూజా కార్యక్రమాలను చేసింది. ఈ పూజాకు డైరెక్టర్ శంకర్ తో పాటు లైకా ప్రొడక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. కానీ, కమల్ హాసన్ ఈ పూజాలో కనిపించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు