Hari Hara Veera Mallu: న్యూయర్ కి నిరాశే..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం లో చేస్తున్న సినిమా హరి హర వీర మల్లు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది. పవర్ స్టార్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఇది అని చెప్పొచ్చు. ఈ చిత్రం పై మేకర్స్ కు, అభిమానులకి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం వరకు పూర్తి అయింది అని సమాచారం.

కొత్త సంవత్సరం సందర్భంగా హరి హర వీరమల్లు నుంచి అప్డేట్ వస్తుందని చాలా రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అభిమానులు కూడా ”హరి హర వీర మల్లు” గ్లింప్స్ వస్తుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా బ్రేక్ లేకుండా సాగుతుంది .

కానీ న్యూ ఇయర్ దగ్గర పడుతున్నా.. మూవీ మేకర్స్ నుంచి అప్డేట్ గురించి ఎలాంటి స్పందన లేదు. దీంతో హరి హర వీరమల్లు నుంచి అప్డేట్ రాదా? అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం టీం బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసే పనిలో ఉంది. పవన్ కళ్యాణ్ కూడా వరుసగా డేట్స్ ఇస్తున్నాడు. న్యూయర్ కి అప్డేట్ ఇవ్వలేకున్నా.. జనవరి నెలలోనే సాలిడ్ అప్డేట్ ను ప్రేక్షకుల ముందుకు మేకర్స్ తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు