Akhil: ‘ఏజెంట్’ కి ఆ సెంటిమెంట్ కలిసొస్తుందా..?

అక్కినేని అఖిల్ హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందిన సినిమా ఏజెంట్. అఖిల్ కెరీర్లో మొదటగా స్పై థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఇంకో పాజిటివ్ అంశం తోడయ్యింది. టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ ‘అడవి రాముడు’, ‘పోకిరి’, ‘బాహుబలి’ సినిమాలు రిలీజ్ అయిన రోజునే ఏజెంట్ సినిమా కూడా రిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. అయితే, ఆ సినిమా రేంజ్ లో ఇండస్ట్రీ హిట్ కాకపోయినా, అఖిల్ ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న బ్రేక్ ఈ సినిమా హిట్ తో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అక్కినేని అభిమానులు.

సినిమా షూటింగ్ మొదలైన నాటి నుండి పలు మార్లు వాయిదా పడుతూ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమాకు ట్రైలర్ రిలీజ్ చేసేంతవరకు పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ప్రమోషన్స్ కూడా హై స్పీడ్ తో చేయటంతో సినిమాకు బజ్ బాగా క్రియేట్ అయ్యింది. మొదట్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసిన మేకర్స్ ప్రమోషన్స్ కి సరిపడా సమయం లేకపోవటంతో ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేసే ఆలోచన విరమించుకున్నారు.

అఖిల్ మార్కెట్ రేంజ్ ని దాటి 80కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను ప్రస్తుతం తెలుగు, మలయాళంలో మాత్రమే విడుదల చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే రిజల్ట్ ని బట్టి ప్రమోషన్స్ కి టైమ్ తీసుకొని హిందీలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట సినిమా యూనిట్. మొత్తానికి అటు అఖిల్ కి, దర్శకుడు సురేందర్ రెడ్డి కి కెరీర్లో హిట్ తప్పనిసరి అయిన దశలో వస్తున్న ఏజెంట్ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో, ఆశించిన విజయం అందుకుంటుందో లేదో వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు