Samantha: సమంత ఇంత లగ్జరీయస్ గా బ్రతకడానికి డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంతపై కొద్ది రోజులుగా భారీ ట్రోలింగ్ అనేది రొటీన్ అయిపోయింది. ఆమె ఏం చేసినా కూడా నెటిజెన్స్ మాత్రం ఆమెని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ట్రోలర్స్ కి సమంత గట్టిగా కౌంటర్లు వేసినా ఆ ట్రోలింగ్ మాత్రం ఆగదు. మొన్నటి వరకు మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సామ్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. కానీ ఈ మధ్యనే ఈ చిన్నది ముందులా నిత్యం సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

కానీ సినిమాలకు ఓ ఏడాది పాటు సమంత బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఈమె తన లైఫ్ ని లగ్జరీయస్ గా గడుపుతుంది. నిజానికి సమంతకు స్థిరాస్తులు ఏమీ లేవు. మరోవైపు విడాకుల తర్వాత పెద్దగా సినిమాల్లో కూడా నటించలేదు. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చి లైఫ్ నీ లగ్జరీగా గడుపుతుండడంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు సమంతకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? సినిమాలలో నటించకపోయినా, ట్రీట్మెంట్ కి ఖర్చు చేస్తున్న డబ్బులు.. ఇలా ఆమెకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే..? దీనంతటికీ కారణం ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టే పోస్టులే అని తెలుస్తోంది. సమంతకి ఇన్స్టాగ్రామ్ లో 24.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరోవైపు పలు టాప్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గానూ వ్యవహరిస్తుంది సమంత. కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారానే నెలకు నాలుగు కోట్లకు పైగా సంపాదిస్తుందట. ఈ కారణంగానే ఆమెకు డబ్బు విషయంలో ఎటువంటి కొదవా లేదని తెలుస్తోంది.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు