Dil Raju: దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాత దిల్ రాజు స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతలలో ఈయన ఒకరు. ఈయన అసలు పేరు వి.వెంకటరమణారెడ్డి. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను ఇండస్ట్రీకి అందించారు. తెలుగులో ఈయన మొట్టమొదటిసారిగా నిర్మించిన చిత్రం దిల్.

ఈ సినిమాతోనే తన పేరుని దిల్ రాజుగా మార్చుకున్నారు. ఆ తరువాత పలు సినిమాల ద్వారా వందల కోట్ల రూపాయలు సంపాదించిన రాజు అంతకుముందు చాలా అప్పుల్లో కూరుకుపోయారని అంటారు.

కానీ అదంతా అబద్ధం. దశాబ్దకాలం క్రితమే వేలాది కోట్ల ఆస్తులకు దిల్ రాజు యాజమాని. అయితే ఇవన్నీ ఆయనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాదట. కేవలం సినిమాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ద్వారానే ఎంతో కష్టపడి సంపాదించుకున్నారట. దిల్ రాజుకి హైదరాబాద్ లోనే ఖరీదైన బంగ్లాలు, ఫ్లాట్లు, ఖరీదైన కార్లు కూడా ఉన్నాయట.అంతేకాకుండా చాలా ప్రాంతాలలో థియేటర్లు కూడా ఉన్నాయి. ఇక ఇటీవల దిల్ రాజు తండ్రి శ్యాంసుందర్ రెడ్డి, కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే.

- Advertisement -

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 9న సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. శ్యాంసుందర్ రెడ్డి వయసు 86 సంవత్సరాలు. నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లెకు చెందిన శ్యాంసుందర్ రెడ్డి, ప్రమీల దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో విజయసింహారెడ్డి, నరసింహారెడ్డి, వెంకటరమణారెడ్డి.

చిన్నవారైన వెంకటరమణారెడ్డిని ఇంట్లో వాళ్ళు ముద్దుగా రాజు అని పిలిచేవారు. అదే పేరుతో ఆయన ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. ఇక పై చదువుల కోసం నిజామాబాద్ నుండి హైదరాబాద్ కి వచ్చిన దిల్ రాజు ఇక్కడే స్థిరపడ్డారు. ఇక ప్రస్తుతం పలు విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలోనే అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు.

Check Filmify for the latest movie news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News &  latest photos of Actress & Actors at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు