Dil Raju : దిల్ రాజుకు కొత్త చిక్కులు తెస్తున్న బలగం.. !

తెలుగు రాష్ట్రాల్లో బలగం సినిమా చేస్తున్న సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 4కోట్ల రూపాయల అతి తక్కువ వ్యయంతో రూపొంది, నెలరోజుల్లో 20కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చిన్న సినిమాల సత్తా చాటుతోంది. సినిమా విడుదలైన 20రోజులకే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నా కూడా ఇంకా థియేటర్లకు వెళ్లి చూసేంతగా నచ్చింది జనానికి ఈ సినిమా. ఇది ఒక ఎత్తైతే, తెలంగాణలోని చాలా పల్లెల్లో ప్రజలు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకొని ఊరంతా కలిసి ఒకే చోట కూర్చొని సినిమా చుస్తూండటం సీనియర్ ఎన్టీఆర్ లవకుశ సినిమా నాటి పాత రోజులను గుర్తు చేస్తోంది. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

జనాల అత్యుత్సాహమో, ఎనలేని ప్రేమో గానీ, పల్లెల్లో రోజు రోజుకి పెరుగుతున్న స్పెషల్ స్క్రీనింగ్స్ పరంపర నిర్మాత దిల్ రాజుకి కొత్త తిప్పలు తెచ్చి పెట్టేలా ఉంది. వివరాల్లోకి వెళితే, సినిమా ఇంకా థియేటర్లలో ఉండగానే ఇలా సామూహిక స్క్రీనింగ్స్ వేస్తూ ఉండటం తనకు, థియేటర్ల యాజమాన్యానికి నష్టం తెచ్చి పెట్టెల ఉందని భావిస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఇదే అంశంపై నిజామాబాద్ ఎస్పీకి ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. ఎక్జిబిషన్ యాక్ట్ ప్రకారం అనుమతి లేకుండా వందల కొద్దీ జనాన్ని పోగేసి ఇలా సినిమా ప్రదశించటం చట్ట విరుద్ధం అని ఎస్పీకి రాసిన లేఖలో దిల్ రాజు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సినిమా విడుదలైన 20రోజులకే ఓటీటీకి ఇవ్వటమే సామూహిక స్క్రీనింగ్స్ కి దారి తీసిందని కొంత మంది వాదన. పెద్ద సినిమాల తరహాలో ఏ నెల రోజుల తర్వాతనో, నెలన్నర తర్వాతనో గానీ ఓటీటీకి ఇచ్చి ఉండుంటే ఇలా ఫ్రీ స్క్రీనింగ్స్ కల్చర్ మొదలయ్యేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సినిమాకు పెరుగుతున్న క్రేజ్ చూసి ఆనందపడుతున్న దిల్ రాజుకు అదే క్రేజ్ కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది. మరి, దిల్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, జరిగిన నష్టాన్ని ఎలా రికవర్ చేస్తారో అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు