Ram Gopal Varma : ఆర్జీవిని ఎక్కి ఎక్కి ఏడ్చెలా చేసిన అమ్మాయి… ఏం చేసిందో తెలుసా?

టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే చేతిలో మందు గ్లాస్ తో పక్కనే అమ్మాయితో చిల్ అయ్యే వ్యక్తి గుర్తొస్తారు. లైఫ్ అంటే ఆయనదేరా అనే ఫీలింగ్ వస్తుంది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆర్జీవి అప్పుడప్పుడూ ట్రోలింగ్ కారణంగా కూడా వార్తల్లో నిలుస్తారు. ఇక ఈయనను ఏడిపించడం అనేది దేవుడు తలచుకున్నా అయ్యే పని కాదేమో. కానీ ఆర్జీవిని ఓ అమ్మాయి మాత్రం వెక్కివెక్కి ఏడ్చేలా చేసిందట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తన వల్ల ఆర్జీవి ఎందుకు అంతలా ఏడ్చాడు? అనే వివరాల్లోకి వెళితే…

ఒకప్పుడు ఎన్నో కల్ట్ క్లాసిక్ హిట్ సినిమాలను ఇచ్చిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ప్రస్తుతం వివాదాస్పద సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కౌంటర్లు వేస్తూ వరుసగా సినిమాలు తీస్తున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తను దర్శకత్వం వహించిన “వ్యూహం” అనే సినిమాను రిలీజ్ చేయడానికి ఆర్జీవి రెడీ అయ్యారు. ఫిబ్రవరి 23న “వ్యూహం” మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో అజ్మల్ అమీర్ వైయస్ జగన్ పాత్రను పోషించగా, ఆయన భార్య భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించింది. ఈ సినిమా రిలీజ్ కు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా ప్రమోషన్లలో భాగంగా ఆర్జీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు. అందులో భాగంగానే ఆర్జీవికి బాధ ఉండదా? అనే ప్రశ్న ఎదురుగా తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సందర్భాన్ని ఆయన బయట పెట్టారు. ముందుగా మీలో రాము, ఆర్జీవీ అనే రెండు పర్సనాలిటీలు ఉన్నాయి అని ఓ ఫ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్ పై స్పందించారు ఆర్జీవి. అది తప్పని, తనలో రెండు పర్సనాలిటీలు ఏమీ లేవని అన్నారు. అందరిలాగే తాను కూడా కొన్ని విషయాలలో ఎమోషనల్ అవుతానని కానీ వెంటనే తేరుకుంటానని అన్నారు.

ఇక “ఎప్పుడైనా ఏడ్చారా?” అనే ప్రశ్నకు సమాధానంగా తాను ఏడుస్తానని, కానీ చాలా తక్కువ సమయమే అని చెప్పుకొచ్చారు. అయన్ ర్యాండ్ పై రూపొందించిన “ఏ సైన్స్ ఆఫ్ లైఫ్” అని డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ఉదహరించారు. ఆ డాక్యుమెంటరీ చూస్తున్న తాను అది పూర్తయ్యే సమయంలో విపరీతంగా ఏడుస్తున్నానని, అసలు తను ఎందుకు ఏడుస్తున్నానో కూడా అర్థం కాలేదని అన్నారు. కనీసం అక్కడ ట్రాజెడీ కూడా జరగలేదని, ఏడ్చే అంత సీన్ లేకపోయినప్పటికీ ఆమె తనకు చాలా నచ్చిందని, అదే తనను సంతోష పెట్టిందని ఆర్జీవి చెప్పుకొచ్చారు. అయితే అలాంటి ఒక మనిషి ఒకప్పుడు ఈ భూమిపై ఉండేది అనేదే తనపై గట్టిగా ఎఫెక్ట్ చూపించిందని వెల్లడించారు. ఎమోషన్ అనేది సెన్సెస్ ను మర్చిపోయేలా చేసేదే తప్ప వేరే ఏం కాదంటూ అయన్ డాక్యుమెంటరీ తనను కన్నీళ్లు పెట్టుకునేలా ఎలా చేసిందనే విషయాన్ని ఆర్జీవి బయట పెట్టారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు