Daggubati Abhiram: త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న దగ్గుబాటి అభిరామ్.. పూర్తి వివరాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతలలో ఒకరైన సురేష్ దగ్గుబాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో చిత్రాలను నిర్మించడమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇదిలా వుండగా ఈయన చిన్న కుమారుడు, హీరో రానా సోదరుడు మరియు నటుడు అయిన దగ్గుబాటి అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అహింస సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే ఘోరమైన డిజాస్టర్ ని సైతం మూట కట్టుకున్నారు.. . గతంలో కూడా అభిరామ్ పైన ఎన్నో అభియోగాలు సైతం వినిపించాయి.

దగ్గుబాటి అభిరామ్ గురించి తాజాగా ఒక విషయం వైరల్ గా మారుతుంది. అదేమిటంటే త్వరలోనే ఇతను వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఈ ఏడాది డిసెంబర్ లోనే వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. డిసెంబర్ 6వ తేదీన రాత్రి 8:50 నిమిషాలకు శ్రీలంకలోని సుందరమైన ఫైవ్ స్టార్ హోటల్లో చాలా గ్రాండ్గా అభిరామ్ వివాహం జరగబోతోందని సమాచారం. అయితే ఇందుకు సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలుబడలేదు

దాదాపుగా 200 మంది కుటుంబ సభ్యులు స్నేహితుల మధ్య ఈ వివాహం అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివాహ వేడుకలలో పాల్గొనేందుకు అతిథులు సైతం సోమవారం రోజునే శ్రీలంకలో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. మూడు రోజులపాటు ఈ వివాహ వేడుకలు చాలా గ్రాండ్గా జరగబోతున్నాయట . అంతే కాదు రేపటి నుంచి అభిరామ్ పెళ్లి పనులు కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది.. మంగళవారం సాయంత్రం 4:30 నిమిషాల నుండి మెహందీ వేడుకలు, ఆ తర్వాత విందు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

బుధవారం ఉదయం 10:30 గంటలకు పెళ్లికూతురు వేడుకలు సైతం నిర్వహించడంతోపాటు పలు రకాల కచేరీలు కూడా నిర్వహించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు వివాహ వేడుకలు ప్రారంభం కాగా రాత్రి 8:50 గంటలకు వీరి వివాహం జరగబోతోందట. అనంతరం హైదరాబాద్ కి తిరిగి వచ్చిన తర్వాత కొద్ది రోజులకు దగ్గుబాటి ఫ్యామిలీ కుటుంబం భారీగా రిసెప్షన్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కూడా హాజరు కాబోతున్నట్లు సమాచారం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు