NTR: “దేవర”కు బ్రేక్… వెకేషన్ మోడ్ లో తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇప్పుడు కొన్నాళ్లు బ్రేక్ పడబోతోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉండడంతో సినిమా షూటింగ్ కొన్ని రోజులు ఆగిపోతుంది.

“ఆర్ఆర్ఆర్” తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ “దేవర” సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”. రెండు భాగాలుగా తెరకెక్కబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. జాన్వికి టాలీవుడ్ లో ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తారక్ సైతం పెద్దగా బ్రేక్స్ తీసుకోకుండా సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దేవర షూటింగ్ నుంచి తారక్ విరామం తీసుకున్నాడు. ఆయన తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్తున్నాడు. అందులో భాగంగానే దేవర మూవీ షూటింగ్ క కొన్ని రోజులు బ్రేక్ పడబోతోంది. సెలబ్రేషన్స్ అనంతరం విదేశాల నుంచి తన ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చాక దేవర షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుంది. ఈ సినిమా మేజర్ షూటింగ్ ను పూర్తి చేసి, పెండింగ్లో ఉన్న పాటలను జనవరి నెలలోగా పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. దేవర ఫస్ట్ పార్ట్ ను 2024 వేసవిలో విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఎన్టీఆర్ మరోవైపు దేవర మూవీ తో పాటు హృతిక్ రోషన్ తో చేస్తున్న వార్ టు పై కాన్సన్ట్రేట్ చేయనున్నాడు. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. వార్డు పూర్తయ్యాక కేజిఎఫ్ తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి తారక్ ఓ ప్రాజెక్టు చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక దేవర మూవీ రెండవ భాగం షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు ఎన్టీఆర్. ఒకవైపు సినిమాలు మరోవైపు తన ప్రొడక్షన్ హౌస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సహ నిర్మాతగా పలు చిత్రాలను చేస్తూ లాభాలను అర్జిస్తున్నాడు తారక్. “ఆర్ఆర్ఆర్”తో పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్టీఆర్ వెకేషన్ కోసం ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోబోతున్నాడు? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

 

Check out Filmify Telugu for Tollywood Movie news updates, the latest Kollywood news, Movie Reviews and ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News and gossip in Tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు