Bollywood: ఈసారైనా సక్సెస్ అవుతారా.?

రన్బీర్ కపూర్ ఏ పాత్రలోనైనా అద్భుతంగా ఇమిడిపోయి  ఆకట్టుకోగలిగే అద్భుతమైన నటుడు అని చెప్పొచ్చు.  కేవలం బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా తమ అభిమాన హీరో అనిపించుకున్నాడు రన్బీర్ కపూర్.  రన్బీర్ కపూర్ చేసిన ఎన్నో సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా  ఆదరించారు.  భాషతో సంబంధం లేకపోయినా సపరేట్ గాసబ్ టైటిల్స్ చూసి మరి రన్బీర్ కపూర్ సినిమాలను చూసిన ఆడియన్స్ కూడా ఉన్నారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రీసెంట్ గా అనిమల్ సినిమాను చేశాడు రన్బీర్ కపూర్.  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.  ఒక సినిమాకు ఉన్న మీటర్ ని,  సినిమాకు ఉన్న స్కేల్ ని సినిమాకు ఉన్న లెక్కల్ని అన్నిటినీ తారుమారు చేస్తూ తన పంతాలో సినిమాను తెరకెక్కించాడు సందీప్ రెడ్డి వంగ.  ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.  ఇకపోతే ప్రస్తుతం అనిమల్ సక్సెస్ లో ఉన్న రన్బీర్.  తన తదుపరి సినిమాను నితీష్ తివారితో చేయనున్నారు.

దంగల్ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నారు నితీష్ తివారి.   నితీష్ తివారి ప్రస్తుతం రామాయణాన్ని తెరకెక్కిస్తున్న  విషయం తెలిసిందే.  అయితే నితీష్ తెరకెక్కిస్తున్న రామాయణంలో రణ్బీర్ కపూర్ రాముడు పాత్రలో కనిపించనున్నారు.  ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడు పాత్రలో, సాయి పల్లవి సీత పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా  ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

- Advertisement -

మరోసారి రామాయణాన్ని తెరకెక్కించే  ప్రయత్నం బాలీవుడ్ చేస్తుండటంతో,  ఈసారైనా రామాయణాన్ని బాగా తెరకెక్కించి  ప్రేక్షకులను మెప్పిస్తారా లేదా అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో ఉంది. నితీష్ తివారి ఈ సినిమా చేయటం వలన కొద్దిపాటి అంచనాలు ఉన్నాయి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు