Bubble Gum: రాజీవ్ – ఎన్టీఆర్ మధ్య గొడవలపై క్లారిటీ ఇచ్చిన రోషన్..!

రోషన్ కనకాల నటిస్తున్న బబుల్ గమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి ఈనెల 29వ తేదీన రాబోతున్నారు.. డైరెక్టర్ రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది రోషన్.. ఇందులో తన తండ్రి రాజీవ్ కనకాల , జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ పైన పలు విషయాలను తెలియజేశారు.. రోషన్ మాట్లాడుతూ.. ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక బంధం.. వీరిద్దరి రిలేషన్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచి మొదలయ్యిందని.. తనకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటూ రోషన్ తెలియజేశారు.

అలాంటి స్నేహితులను వదులుకోకూడదని తారక్ అన్నను చూసి డ్యాన్స్ నేర్చుకోమని తన తండ్రి ఎప్పుడు చెబుతూ ఉండేవారని తెలిపారు. ఆయన స్థాయికి చేరుకోవాలని తన కోరిక కూడా అని తెలిపారు రోషన్ కనకాల.. ఇక ఎన్టీఆర్ , రాజీవ్ మధ్య దూరం పెరిగిందనే వార్తలపై స్పందిస్తూ అలాంటిది ఏమీ లేదు.. తనకు తెలిసి ఎప్పుడూ కూడా వాళ్ళు కలిసే ఉన్నారు అని తెలియజేశారు. వారిద్దరి మధ్య ఏదైనా జరిగితేనే కదా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. అలాంటిదేమీ లేదని తెలిపారు రోషన్.

సుమా కుమారుడు కాబట్టి చిరంజీవి సపోర్టు ఉందని వార్తలు వినిపిస్తున్నాయి అది నిజమేనా అని యాంకర్ అడగగా.. చిరంజీవి గారు ఎప్పుడు అలా సపోర్ట్ చేయలేదని.. కేవలం టీజర్ నచ్చిందని సాంగ్ కూడా నచ్చిందని.. నువ్వు కూడా పాట పాడావా అని అడిగారని తెలిపారు. దీంతో తన వాయిస్ బాగుందని చెప్పారని తెలియజేయడం జరిగింది.. ఇందులోని లిప్ లాక్ సన్నివేశాల కోసం 150 టేక్స్ తీసుకున్నారా అంటూ యాంకర్ అడగగా దీనికి కాస్త కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయిన రోషన్ హీరోయిన్ మానస చౌదరిని తీసుకువచ్చి ఎన్ని టేకులు తీసుకున్నావో చెప్పు అంటూ ఆమెనే అడగడం జరిగింది. దీంతో ఇదంతా ఫన్నీ కోసమే చేశాను అంటూ సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రోషన్. మరి ఏ మేరకు ఈ సినిమా హీరోగా రోషన్ ని నిలబెడుతుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు