Animal Movie Actress: సౌత్ ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరోతో చేయాలని ఉంది – త్రిప్తి దిమ్రి

సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా దూసుకెళ్తుంది. ఈ సినిమా సందీప్ రెడ్డి, రణబీర్ తో పాటు రష్మిక కెరీర్ కు చాలా ఉపయోగపడింది. వీరితో పాటు యానిమల్ సినిమా మరొకరిని ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ ని చేసింది. అది ఎవరో కాదు.. యానిమల్ సినిమాలో బోల్డ్ గా కనిపించిన త్రిప్తి దిమ్రి. ఈ బోల్డ్ యాక్టరస్ యానిమల్ సినిమాలో కనిపించింది కొంత సమయమే అయినా, ఆడియన్స్ మర్చిపోలేకపోతున్నారు.

అందుకే యానిమల్ చిత్రం రిలీజ్ అయి.. 13 రోజులు అవుతున్నా.. ఆమె గురించి, ఆమె చేసిన సీన్స్ గురించే మాట్లాడుతున్నారు. అంతే కాదు… ఇంకా త్రిప్తి గురించి పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు. అలాగే ఈ బ్యూటీ తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటుంది అనే దానిపై కూడా ఆడియన్స్ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఇంటర్వ్యూలో జరుగుతున్నాయి. రీసెంట్ గా త్రిప్తి దిమ్రి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో త్రిప్తికి సౌత్ ఇండస్ట్రీలో ఫేవరెట్ హీరో ఎవరు? ఎవరితో నటించాలని ఉంది ? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

దీనికి త్రిప్తి ఏ మాత్రం ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పేసింది. త్రిప్తి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తారక్ తో కేవలం తెలుగు హీరోయిన్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా సినిమాలు చేయాలనుకుంటారు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తన ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2 కోసం తారక్ రెడీ గా ఉన్నాడు.

- Advertisement -

హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న వార్ 2 లో జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ చేతిలో ప్రస్తుతం ఈ వార్ 2 తో పాటు తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవరా ఉంది. దేవరా రెండు పార్ట్ లుగా రాబోతుంది. దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31కి ప్లాన్ జరుగుతుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు